Rakesh Jhunjhunwala: పెట్టుబడుల విషయంలో అంటే పెట్టుబడులకు కంపెనీల ఎంపికలో చాలా మంది స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలాను ఫాలో అవుతుంటారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయనను అనుసరించి ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలను పొందేవారు చాలా మందే ఉన్నారు. అలా రెండు దశాబ్దాల క్రితం ఈ టాటా గ్రూప్ స్టాక్‌లో కేవలం రూ. 20,000 పెట్టుబడి పెట్టి ఉంటే.. మీరు ఈ రోజు కోటీశ్వరులై ఉండేవారు. అవునండి దీర్ఘకాలం మంచి కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు మరి ఇలాగే ఊహించని రీతిలో ఉంటాయి. ఇంతకీ ఇప్పటి వరకూ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ ఏంటంటే.. టాటా గ్రూప్ కంపెనీ అయిన టైటాన్ షేర్. కేవలం 20 ఏళ్లలో టైటాన్ షేర్ రూ.4.03 నుంచి రూ.2138కి పెరిగింది. అంటే టైటాన్ తన ఇన్వెస్టర్లకు 53,000 శాతం రాబడిని అందించింది.

మల్టీబ్యాగర్ రిటర్న్స్:
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు మంచి వ్యాపార సంస్థకు చెందిన కంపెనీ షేర్లలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే.. అవి మల్టీబ్యాగర్‌గా రాబడిని అందించి తమ సత్తాను ఎల్లప్పుడూ నిరూపించుకుంటాయి.ఐదేళ్ల క్రితం టైటాన్ కంపెనీ షేర్లను ఎవరైనా కొనుగోలు చేసి ఉంటే.. ఇప్పుడు వారికి ఏకంగా 315 శాతం రాబడి వచ్చేది. ఈ సమయంలో టైటాన్ షేర్ ధర రూ. 516 నుంచి రూ. 2138 వరకు పెరిగింది. ఇన్వెస్టర్ 10 ఏళ్ల క్రితం టైటాన్ షేర్లను కొనుగోలు చేసి ఉంటే.. అతనికి 870 శాతం రాబడి వచ్చేది. దశాబ్ద కాలంలో ఈ స్టాక్ రూ.221 నుంచి రూ.2138కి చేరింది. అలాగే 20 ఏళ్లలో స్టాక్ పెట్టుబడిదారులకు 530 రెట్లు రాబడిని ఇచ్చింది. ఈ సమయంలో టైటాన్ షేరు రూ.4.03 నుంచి రూ.2138కి చేరుకుంది.

రూ.10 వేలను రూ.53 లక్షలుగా మార్చింది..
మీరు 20 సంవత్సరాల క్రితం టైటాన్ స్టాక్‌లో రూ. 10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుతం మీ పెట్టుబడి విలువ రూ. 53 లక్షలు అయ్యేది. మీరు 10 సంవత్సరాల క్రితం రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే.. పెట్టుబడి విలువ ప్రస్తుతం రూ.97,000 అయ్యేది. అదే ఐదేళ్ల క్రితం రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే.. దాని విలువ ఇప్పుడు రూ.41,500గా ఉండేది.

బిగ్ బుల్‌కి టైటాన్ కంపెనీలో ఎంత వాటా ఉంది?
రాకేష్ జున్‌జున్‌వాలా, అతని భార్య రేఖా జున్‌జున్‌వాలాలకు టైటాన్ కంపెనీలో పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో రాకేష్ జున్‌జున్‌వాలా టైటాన్‌లో మొత్తం 3,53,10,395 షేర్లను కలిగి ఉన్నారు. ఇది మొత్తం కంపెనీలో 3.98 శాతం వాటాకు సమానం. అదే సమయంలో రేఖా జున్‌జున్‌వాలాకు టైటాన్ కంపెనీలో 95,40,575 షేర్లు ఉన్నాయి. ఈ షేర్లు 1.07 శాతం వాటాకు సరిసమానం అని చెప్పుకోవాలి. అంటే భార్యాభర్తలిద్దరికీ కలిపి సంయుక్తంగా టైటాన్ కంపెనీలో 5.05 శాతం వాటా ఉంది.

2022లో పనితీరు ఇలా:
అయితే.. టైటాన్ స్టాక్ 2022లో పెట్టుబడిదారులను నిరాశపరిచిందని చెప్పుకోవాలి. ఈ కాలంలో షేరు ధర 15 శాతం వరకూ క్షీణించింది. నిజానికి ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఖరీదైన అప్పులు వంటి మరికొన్ని కారణాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనానికి గురయ్యాయి. ఇవి టైటాన్ స్టాక్‌ను కూడా ప్రభావితం చేశాయి.
Note: పైన అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వాటి ఆదారంగా ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోవద్దు. మార్కెట్లలో ట్రేడింగ్ నష్టాలతో కూడుకున్నది. సరైన ఆర్థిక సలహాదారు సూచనల మేరకు పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications