దేశ ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది. ఈ పథకాలలో ఒకటి ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం. ఈ పథకం కొద్దిరోజుల క్రితమే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పథకం వల్ల పురుషులు మాత్రమే కాకూండా మహిళలు కూడా ఎంతో లబ్ది పొందుతున్నారు. అంతేకాక ఈ స్కిం మహిళలను సాధికారపరచడంలో పెద్ద పాత్ర పోషించింది ఇంకా మహిళలు ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. ఈ పథకం లబ్ధిదారులలో 68 శాతం మంది మహిళలు ఉన్నారంటే ఈ స్కిం ఎంత విజయవంతం అయిందో స్పష్టం అవుతుంది.

అయితే ప్రధాన మంత్రి ముద్ర లోన్ కింద దేశ ప్రజలకు స్మాల్ నాన్-కార్పొరేట్, వ్యవసాయేతర కానీ చిన్న/సూక్ష్మ వ్యాపారాల కోసం రూ. 10 లక్షల వరకు లోన్ ఇవ్వబడుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పథకం ద్వారా మహిళలని ఆర్థికంగా సాధికారత సాధించడానికి ప్రభుత్వం ఎటువంటి ఆస్తి లేకున్న లోన్ అందిస్తుంది.
మహిళలకు ముద్ర రుణాలు :కేంద్ర ప్రభుత్వ ఈ లోన్ స్కింలో మహిళలకి సొంత వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు ఇస్తారు. ఈ పథకం కింద పురుషులు కూడా రుణాలు పొందవచ్చు, కానీ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దేశంలోని మహిళలే ఈ పథకం వల్ల చాలా ప్రయోజనం పొందారు. వీళ్ళకి ఎటువంటి ఆస్తి లేకపోయినా రూ. 10 లక్షల వరకు రుణాలు లభిస్తాయి, దీని ద్వారా కుట్టు యూనిట్లు, బ్యూటీ పార్లర్లు, ఫుడ్ స్టాల్స్, కిరాణా షాపులు వంటి చిన్న వ్యాపారాలను ప్రారంభించవచ్చు.
ఈ పథకంలో 68 శాతం లబ్ధిదారులు మహిళలే : ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో 68 శాతం మంది మహిళలే ఉన్నారని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. గత 10 సంవత్సరాలలో ముద్ర పథకం కింద 52 కోట్ల మందికి వ్యాపారాలు ప్రారంభించడానికి రూ.33 లక్షల కోట్లకు పైగా అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చామని అన్నారు. ఈ రుణాలు రూ.50,000 నుండి రూ.20 లక్షల వరకు ఉన్నాయని, ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 68 శాతం మంది మహిళలు కూలీ పనిని వదిలివేసి సొంత వ్యాపారాన్ని ప్రారంభించారని చెప్పారు.
ప్రధాన మంత్రి ముద్ర రుణాలు ఇప్పుడు నాలుగు రకాలుగా ఉంటాయి. శిశు, కిషోర్, తరుణ్ అలాగే కొత్తగా తీసుకొచ్చిన తరుణ్ ప్లస్. శిశు రకం కింద రూ. 50 వేల వరకు రుణాలు ఇస్తారు. ఇది కాకుండా కిషోర్ రకం కింద రూ. 50 వేల నుండి రూ. 5 లక్షల వరకు లోన్ ఇస్తారు. తరుణ్ రకం కింద రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీనితో పాటు తరుణ్ ప్లస్ రకం కింద రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు లోన్ అందిస్తుంది.
ఈ లోన్ దేనికి ఇస్తారంటే : ఈ రుణాలు ఏదైనా ఉత్పత్తి తయారీ, వ్యాపారం, సేవల రంగాలు ప్రారంభించేందుకు ఇస్తారు, వీటిలో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం మొదలైనవి కూడా ఉన్నాయి. దీని వడ్డీ రేట్లు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ఉంటాయి.
ఈ పథకం కింద ఎన్ని రుణాలు ఇచ్చారంటే: ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద గత 10 సంవత్సరాలలో రూ.33.65 లక్షల కోట్లకు పైగా ముద్ర రుణాలు ఇచ్చారు. శిశు కేటగిరీ కింద మొత్తం రూ.8.49 లక్షల కోట్లు, కిషోర్ కేటగిరీ కింద రూ.4.90 లక్షల కోట్లు, తరుణ్ కేటగిరీ కింద రూ.0.85 లక్షల కోట్లు రుణాలు ఇచ్చారు.
ముద్ర లోన్ ఎలా పొందాలి: నాన్ అగ్రికల్చర్ సెక్టార్లో చిన్న వ్యాపారాన్ని (షాపు, సర్వీస్, తయారీ, వ్యాపారం మొదలైనవి) ప్రారంభించాలనుకునే లేదా విస్తరించాలనుకునే ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకోసం అప్లయ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకు, మైక్రోఫైనాన్స్ సంస్థ లేదా NBFCలో ఈ ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వ్యాపార వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి అవసరమైన డాకుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అలాగే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా అప్లయ్ చేయవచ్చు.
ఈ స్కిం వల్ల లాభాలు: ఏ ఆస్తులను సురిటీగా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రభుత్వ సహకారం కారణంగా వడ్డీ రేట్లు ఇతర లోన్ల కంటే తక్కువగా ఉంటాయి. వ్యాపార అవసరాలకు అనుగుణంగా లోన్ మొత్తం ఇంకా తిరిగి చెల్లించే వ్యవధిని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాదు మహిళా వ్యాపారస్తులకు ప్రత్యేక డిస్కౌంట్స్ ఇంకా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.
ముద్ర లోన్ లాంటి ఇతర లోన్స్ : ముద్రా యోజన కాకుండా ప్రధాన మంత్రి స్వానిధి యోజన, ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ (ఉత్తరప్రదేశ్), పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ యోజన వంటి షూరిటీ లేకుండా లోన్స్ అందించే పథకాలు కూడా ఉన్నాయి. ముద్ర లోన్ పొందటానికి దరఖాస్తుదారుల వయస్సు 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన టైంలో లోన్ తిరిగి చెల్లించిన వారికీ బ్యాంక్/NBFC ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే రుణ ఎగవేతలు ఉన్న కస్టమర్లకు ఇంకా క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న భారతీయ ప్రజలు ఈ లోన్ అప్లయ్ చేసుకోవడానికే అర్హులు కాదు.
ఏప్రిల్ 2015లో ప్రారంభించినప్పటి నుండి ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMUDRA యోజన) 52 కోట్లకు పైగా రుణాలను సాంక్షన్ చేసింది, దీని విలువ రూ. 32.61 లక్షల కోట్లు. వ్యాపార వృద్ధి ఇకపై కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా విస్తరిస్తోంది. బ్యాంకుల నుండి రుణాలు తీసుకోలేని చాలా మంది చిన్న పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రధాన మంత్రి ముద్ర రుణ పథకం ఒక వరంలా మారింది అని చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా చిన్న దుకాణదారులు, పండ్లు - కూరగాయల విక్రేతలు, ఆటో-రిక్షా డ్రైవర్లు, టైలర్లు ఇంకా చిన్న తయారీదారులు ముందుకు సాగడానికి అవకాశం లభించింది.
ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం గురించి అందరికీ తెలియదు. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకున్నప్పటికీ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం చాలా మందికి అడ్డంకిగా ఉంది. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా మార్చడానికి ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించాలని యోచిస్తోంది. దీనితో పాటు స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలను ఈ పథకంతో అనుసంధానించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications