పెన్నీ స్టాక్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. పెన్నీ స్టాక్స్ ధర సుమారు రూ.10 లేదా రూ.20 కంటే తక్కువ ఉంటుంది. అలాగే వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చాల తక్కువ ఉంటుంది. అందుకే వీటిని పెన్నీ స్టాక్స్ అని పిలుస్తారు. అయితే పెన్నీ స్టాక్స్ మంచి రాబడి ఇస్తాయని తెలిసిందే. అందుకే ఈ షేర్లపై ట్రేడింగ్ చేసే వారు వాటిని హాయిగా కొనేయొచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఎన్నో పెన్నీ స్టాక్‌లు ఉన్నాయి, ఇవి మార్కెట్ హెచ్చు తగ్గులకు లేదా ఒడిదుడులకు దూరంగా పెట్టుబడిదారులకు మంచి రాబడిని ఇస్తున్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టి చాలా తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు.
వీటిలో ఒక పెన్నీ స్టాక్ రాడాన్ మీడియావర్క్స్ ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్ కొంతకాలంగా ఇన్వెస్టర్లకు మంచి రాబడిని అందిస్తోంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దీని ధర రూ.5 కంటే తక్కువ. గత కొన్ని రోజులుగా ఇందులో అప్పర్ సర్క్యూట్ కనిపిస్తోంది. మంగళవారం కూడా హై సర్క్యూట్ రికాడైంది. ప్రస్తుతం దీని ధర రూ.4.81.

6 నెలల్లో 90% కంటే ఎక్కువ రాబడి
ఈ స్టాక్ గత 6 నెలల్లో పెట్టుబడిదారులకు 90 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ఆరు నెలల క్రితం మేలో దీని షేరు ధర రూ.2.50. ఇప్పుడు దీని ధర రూ.4.81. అంటే ఈ 6 నెలల్లో 92 శాతం రాబడిని ఇచ్చింది. అంటే రూ.లక్ష పెట్టుబడిపై పెట్టుబడిదారులకు 6 నెలల్లో రూ.92 వేల లాభం వచ్చేది.
1 జనవరి 2024 నుండి చూస్తే ఇప్పటి వరకు ఈ స్టాక్ పెట్టుబడి మొత్తాన్ని డబుల్ కంటే ఎక్కువ చేసింది. జనవరి 1న దీని షేరు ధర రూ.1.90. ఇప్పుడు రూ.4.81గా ఉంది. ఈ విధంగా చూస్తే ఈ సంవత్సరం ఇప్పటివరకు సుమారు 11 నెలల్లో 153 శాతం రాబడిని ఇచ్చింది. జనవరి 1న రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ మొత్తం రూ.2.53 లక్షలకు పెరిగి ఉండేది.
అంతేకాదు ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు ఒక సంవత్సరంలో మంచి రాబడులను అందించింది. ఒక సంవత్సరంలో దీని రాబడి 220 శాతం. అంటే ఈ కాలంలో పెట్టుబడి పెట్టిన మొత్తం మూడు రెట్లు పెరిగేది.
కంపెనీ మార్కెట్ క్యాప్ ఎంత?
ఈ స్టాక్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి. దీని కార్యక్రమాలు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఛానెల్‌లలో కనిపిస్తాయి. కంపెనీ వ్యాపారం ఇతర దేశాలకి కూడా విస్తరించింది. BSE వెబ్‌సైట్ ప్రకారం, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.19.69 కోట్లు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications