స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారికి మంచి ఛాన్స్. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రతి ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ మే నెల కోసం ఒక మంచి స్టాక్‌ను తీసుకొచ్చింది. అదే APL అపోలో ట్యూబ్స్ (APLAPOLLO). ఈ షేర్ రాబోయే రోజుల్లో ఏకంగా 6.66 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది.

ఇనుము, ఉక్కు ఉత్పత్తుల తయారీలో అగ్రగామిగా ఉన్న APL అపోలో ట్యూబ్స్ షేర్లు నిన్నటి ట్రేడింగ్‌లో మంచి పర్ఫార్మెన్స్ చూపించాయి. అలాగే రోజు ముగిసే సమయానికి షేరు ధర 2.99 శాతం పెరిగి రూ.1,662.85 వద్ద స్థిరపడింది. దీనికి ముందురోజు షేర్ ధర రూ.1,614.55గా ఉంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, APL అపోలో ట్యూబ్స్ షేర్లు గత కొంతకాలంగా స్థిరమైన కదలికను కనబరిచాయి. నిన్నటి బుధవారం ట్రేడింగ్‌లో రూ.1,650 స్థాయిని దాటి ఒక ట్రెండ్ సృష్టించిందని చెప్పవచ్చు. అయితే ఈ షేర్ కొనుగోళ్లకి మంచి డిమాండ్ లభిస్తుండటంతో ఈ షేరుపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా బుల్లిష్ ట్రెండ్ చూపుతోంది.
APL అపోలో ట్యూబ్స్ షేర్ల పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే అద్భుతంగా ఉంది. గత ఐదు సంవత్సరాలలో ఈ షేరు పెట్టుబడిదారులకు ఏకంగా 1,235 శాతం కంటే పైగా రిటర్న్స్ అందించింది. ఇంకా ఒక్క సంవత్సరంలోనే 7 శాతం లాభాలను ఇచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకుంటే ఈ షేరు 4.32 శాతం పెరిగింది. గత ఒక్క నెలలోనే దాదాపు 15 శాతం లాభాలను ఆర్జించింది. ప్రస్తుతం ఈ షేరు 52 వారాల గరిష్ట స్థాయి మే 22న చూస్తే రూ.1,729.45. ఇక బుధవారం నాటికి ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.46,148.17 కోట్లుగా ఉంది.
అనలిస్ట్ ఆనంద్ రతి ఈ షేర్ పై పెట్టుబడిదారులకు ఒక స్పష్టమైన సూచన ఇస్తున్నారు. అతని ప్రకారం, రూ.1,650 వద్ద ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే టార్గెట్ ధర రూ.1,760గా నిర్ణయించారు. ఒకవేళ మార్కెట్ అనుకూలంగా లేకుండ కదిలితే నష్టాన్ని లిమిట్ చేయడానికి స్టాప్ లాస్ రూ.1,594 వద్ద ఉంచాలని సూచిస్తున్నారు.
APL అపోలో ట్యూబ్స్ భారతీయ స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్‌ల మార్కెట్‌లో అతిపెద్ద ఉత్పత్తిదారులలో ఒకటి. దేశవ్యాప్తంగా 29 నగరాల్లో వేర్ హౌసెస్ ఇంకా బ్రాంచ్ ఆఫీసులతో మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఉంది. అంతేకాకుండా ఈ సంస్థ 20కి పైగా దేశాలకు కంపెనీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఢిల్లీ NCR కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీకి భారతదేశంలో 800 కంటే ఎక్కువగా డీలర్ల నెట్‌వర్క్ ఉంది. ప్రీ-గాల్వనైజ్డ్ ట్యూబ్‌లు, స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్‌లు, గాల్వనైజ్డ్ ట్యూబ్‌లు, MS బ్లాక్ పైప్‌లు వంటి చాల రకాల ఉక్కు ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేస్తోంది.
మొత్తానికి, APL అపోలో ట్యూబ్స్ రాబోయే రోజుల్లో మంచి రాబడినిచ్చే అవకాశం ఉన్న ఒక బంపర్ స్టాక్‌గా కనిపిస్తోంది. అయితే పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని పరిశీలించవచ్చు. కానీ ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ స్వంత రీసర్చ్ చేయడం అలాగే ఫైనాన్షియల్ అడ్వైజరుని సంప్రదించడం ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications