స్టాక్ మార్కెట్ నుండి లాభాలు సంపాదించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే దీనికి చాల ఎక్కువ రీసర్చ్, అవగాహన ఇంకా ఓపిక అవసరం. అంతేకాదు స్టాక్ మార్కెట్ ద్వారా తక్కువ టైంలోనే ఎక్కవ డబ్బులు సంపాదించొచ్చు అనేది అపోహ. షేర్ మార్కెట్లో పెట్టుబడి చేసే పెట్టుబడిదారులు ప్రతిసారి ఎక్కువ రిటార్న్స్ ఇచ్చే మల్టీబ్యాగర్ స్టాక్‌ల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే మీరు పెట్టుబడి చేసిన చిన్న మొత్తం కొన్ని ఏళ్ళకి కోట్లకి మారితే ఎలా ఉంటుంది... 26 సంవత్సరాలలో 44,706.26% రాబడిని ఇచ్చిన ఇలాంటి భారత్ రసాయన్(Bharat Rasayan ) స్టాక్ గురించి మీకు తెలుసా...

మీలో ఎవరైనా జనవరి 1999న ఈ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, నేడు వాళ్ల దగ్గర రూ.4.4 కోట్లకు పైగా ఉండేది. అప్పట్లో ఈ షేరు వాల్యూ కేవలం రూ.24.75 కాగా నేడు రూ.11052.15కి చేరుకుంది. అయితే ఈ స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఖచ్చితంగా మీ నిపుణుల సలహా తీసుకోవాల్సిందే.
16 సంవత్సరాలలో 28,014% అద్భుతమైన రాబడి: గత 16 సంవత్సరాల రిటర్న్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ 16 సంవత్సరాలలో ఈ షేర్ 28,014% భారీ రాబడిని ఇచ్చింది. 2009లో ఈ షేరు ధర రూ.39.40, కానీ నేటి ధర (NSEలో ఉదయం) రూ.11,096. అంటే మొత్తం రాబడి 28,014% ( 280 రెట్లు). మీరు 2009లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే నేడు అదే డబ్బు రూ. 2.81 కోట్లు అయ్యేది.
షేర్ ధర ట్రెండ్: ఈరోజు స్టాక్ రూ.10962.70 వద్ద ప్రారంభమైంది, నిన్నటి మునుపటి ముగింపు రూ.11041.15తో పోలిస్తే త్వరలోనే రూ.11219.95కి చేరుకుంది. మధ్యాహ్నం పావు నుండి రెండు గంటల ప్రాంతంలో, అది రూ.1102.55కి తగ్గింది. స్టాక్ మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ గత ఒక నెలలో దాదాపు 10 శాతం రాబడిని ఇచ్చింది. ఇక ఆరు నెలల గురించి మాట్లాడుకుంటే కేవలం 3.57 శాతం మాత్రంతో కాస్త తగ్గింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 8.80% పెరిగింది. మీరు ఇప్పటికే ఈ స్టాక్ కొనే ఉంటే దాన్ని హోల్డ్'లో పెట్టుకోండి. కొత్త పెట్టుబడిదారులు రీసర్చ్ చేసిన తర్వాతే పెట్టుబడికి నిర్ణయం తీసుకోవాలి.
కంపెనీ ఆర్థిక పరిస్థితి
*నికర లాభం: 164.73% పెరిగింది (రూ.15.31 కోట్ల నుండి రూ.40.53 కోట్లకు)
- EBITDA: 55.64% పెరిగింది (రూ.31.45 కోట్ల నుండి రూ.48.95 కోట్లకు)
- నికర అమ్మకాలు: 10.07% వృద్ధి (రూ.232.94 కోట్ల నుండి రూ.256.40 కోట్లకు)
- EPS (ఒక్కో షేరుకు ఆదాయాలు): రూ.36.85 నుండి రూ.97.54 వరకు (165% భారీ లాభం)
భరత్ రసాయన్ ఏం చేస్తుంటుంది: భారత్ రసాయన్ అనేది పురుగుమందులు అలాగే రసాయనాలను తయారు చేసే వ్యవసాయ రసాయనాల సంస్థ. రైతుల అవసరాలు ఇంకా ఎగుమతి డిమాండ్ పెరుగుతున్న కారణంగా ఈ రంగంలో వృద్ధి అవకాశాలు ఉన్నాయి.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications