ముంబై: ఫేస్‌బుక్ - రిలయన్స్ జియో డీల్ నేపథ్యంలో బుధవారం రిలయన్స్ మార్కెట్‌ను నడిపించింది. దీనికి అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడయ్యాయి. సోషల్ మీడియా దిగ్గజం రూ.43,574 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ప్రకటించడంతో రిలయన్స్ షేర్ బీఎస్ఈలో ఏకంగా 10.30 శాతం పెరిగి రూ.1363వద్ద ముగిసింది. షేర్ వ్యాల్యూ పెరగడంతో రిలయన్స్ మార్కెట్ క్యాప్ కూడా రూ.80,710 కోట్లు పెరిగి రూ.8,64,267 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ సానుకూలత, ముడి చమురు ధరలు రెండు దశాబ్దాల కనిష్టానికి చేరుకోవడం, సానుకూల అంతర్జాతీయ పరిణమాలు మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి. డాలర్ మారకంతో రూపాయి 15 పైసలు పెరిగి 76.68 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లో టోక్యో మినహా అన్నీ లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి.

బోర్డులో స్థానం
రిలయన్స్ జియో - ఫేస్‌బుక్ డీల్ తర్వాత జియో ప్లాట్‌ఫాంలో అతిపెద్ద మైనార్టీ షేర్ హోల్డర్ కానుంది సోషల్ మీడియా దిగ్గజం. జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్ వ్యాల్యూ రూ.4.62 లక్షల కోట్లు (6,595 కోట్ల డాలర్లు)గా లెక్కగట్టారు. వాటా విక్రయ ప్రక్రియలో భాగంగా ఫేస్‌బుక్‌కు తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయడంతో పాటు జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డులో స్థానం కల్పిస్తారు. అంబానీ తనయుడు ఆకాశ్, కుమార్తె ఇషా అంబానీలు ఈ కంపెనీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు.

రుణభారం తగ్గించుకోనున్న రిలయన్స్
ఈ డీల్ ద్వారా లభించే నిధుల్లో రూ.15,000 కోట్లను అట్టిపెట్టుకొని, మిగతా సొమ్ముతో రిలయన్స్ రుణ భారాన్ని తగ్గించుకోనుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌కు రూ.40,000 కోట్ల మేర రుణ భారం ఉంది. డిజిటల్ సేవలన్నింటిని ఒకేతాటి పైకి తెచ్చేందుకు గత ఏడాది అక్టోబర్ నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అనుబంధ కంపెనీగా జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగానే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్... జియో ప్లాట్‌ఫామ్స్‌కు అనుబంధ కంపెనీగా మారింది. జియోలో వాటాలు విక్రయించనున్నట్లు గత ఏడాది ఆగస్ట్‌లో ముఖేష్ అంబానీ తెలిపారు.

ఎక్స్‌క్లూజివ్ డీల్ కాదు.. కొత్త ట్విస్ట్
2014 తర్వాత ఫేస్‌బుక్‌కు ఇదే అతి పెద్ద డీల్. అప్పుడు వాట్సాప్‌ను టేకోవర్ చేసింది. అదే సమయంలో లాక్ డౌన్సమయంలో అథి పెద్ద కార్పోరేట్ డీల్. రిమోట్ సంప్రదింపుల ద్వారా ఒప్పందం జరిగింది. అలాగే ఇది ఎక్స్‌క్లూజివ్ డీల్ కాదు. అంటే ఫేస్‌బుక్ ఇండియాలోని ఇతర రిటైల్ కంపెనీలతో జట్టుకట్టే అవకాశాలు ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటారా అంటే ఈ తరహా ఒప్పందాలకు అవకాశాలు తెరిచే ఉంటాయని ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ అజిత్ మోహన్ తెలిపారు. అందర్నీ దూరం పెట్టాలనే ప్రతిపాదన తమ ఒప్పందంలో లేదన్నారు. ఫేస్‌బుక్, జియో స్వతంత్ర సంస్థలు అని, సొంత అభిప్రాయాలు ఉంటాయని తెలిపారు. ఏ విభాగాల్లో పోటీ పడాలో, ఏ విభాగాల్లో కలిసి పని చేయాలో వాటికి తెలుసునని చెప్పారు. తద్వారా పోటీ పోటీయే అని చెప్పారు.

జియోకు ఏం లాభం
- రిలయన్స్ జియోకు రుణ భారం తగ్గుతుంది.
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ధీటుగా జియో మార్ట్‌కు ఉపయోగపడుతుంది.
- టెక్నాలజీలో ఫేస్‌బుక్ అనుభవం, నైపుణ్యాల ఊతంతో జియోను భారీ డిజిటల్ కంపెనీగా తీర్చేందుకు రిలయన్స్‌కు ఉపయోగపడుతుంది.
- వాట్సాప్ సహకారంతో కిరాణా దుకాణాలకు చేరువ కావొచ్చు.
- ఫేస్‌బుక్ విషయానికి వస్తే జియో ప్లాట్‌ఫామ్స్‌లో మైనార్టీ వాటా, బోర్డులో స్థానం.
- చైనా తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్లోకి ప్రవేశం.
- 38 కోట్లకు పైగా ఉన్న జియో కస్టమర్లకు చేరుకునే అవకాశం. 2022 నాటికి ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య దేశీయంగా 85 కోట్లకు పెరగనుంది. అంతకంతకూ ఎదుగుతున్న జియో ద్వారా ఫేస్‌బుక్‌కు ప్రయోజనం.
- రిలయన్స్ ఈ-కామర్స్ వంటి వ్యాపార ప్రణాళికల్లో భాగస్వామ్యం.

యూజర్లు.. ప్రయోజనాలు
భారత్‌లో దాదాపు 40 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు ఉన్నారు. అలాగే 25 కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్ వినియోగదారులు ఉన్నారు. ఇక రిలయన్స్ జియో కస్టమర్లు 38 కోట్లకు పైగా ఉన్నారు. వీరి ఒకరి బలం మరొకరికి ప్రయోజనం. ఆన్ లైన్ చెల్లింపులు, ఈ-కామర్స్ బిజినెస్ వీరికి సులభతరం కానుంది. జియో ఈ-కామర్స్ వ్యాపారం, వాట్సాప్, వాట్సాప్ పే సేవల అనుసంధానం ఫేస్‌బుక్‌కు కలిసి వస్తుందని చెబుతున్నారు. జియో మార్ట్స్, వాట్సాప్ కలిసి 3 కోట్ల చిన్న కిరాణా షాప్స్ నిర్వాహకులకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నెరిపే అవకాశం కల్పిస్తారు.

రిలయన్స్ భారం తగ్గింది ఇలా...
గత ఏడాది డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి రిలయన్స్ రుణభారం రూ.3,06,851 కోట్లుగా ఉంది. నగదు రూ. 1,53,719 కోట్లు ఉంది. దీంతో నికర రుణ భారం రూ. 1,53,132 కోట్లు. 2021 నాటికి రుణరహిత సంస్థగా ఉండాలని ముఖేష్ అంబాని నిర్ణయించారు. తన క్రూడ్, కెమికల్ బిజినెస్‌లో 20% వాటాను సౌదీ ఆరామ్‌కోకు విక్రయించడం ద్వారా 15 బిలియన్ డాలర్లు సమీకరిస్తోంది. ఇంధన రిటైల్ విభాగంలో వాటాలను బ్రిటన్ సంస్థ బ్రిటిష్ పెట్రోలియంకు రూ.7,000 కోట్లకు విక్రయించింది. ఇప్పుడు ఫేస్‌బుక్ డీల్‌తో రుణభారం తగ్గించుకునే దిశగా మరో అడుగు వేసింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications