Success Story: నెయిల్ పాలిష్ వేస్తూ నెలకు రూ.10 లక్షలు సంపాదిస్తున్న మహిళ..!
సాధారణంగా నెయిల్ పెయింట్ ఎవరిది వారే వేసుకుంటారు. సంపన్నులు బ్యూటీ పార్లర్ కు వెళ్లి నెయిల్ పెయింట్ వేయించుకుంటారు. అయితే ఈ నెయిల్ పెయింట్ వేస్తే ఎంత వస్తాయి. మహా అంటే రూ.500 ఉండొచ్చు. కానీ మహిళ నెయిల్ పెయింట్ వేస్తూ నెలకు రూ.10 లక్షలు సంపాదిస్తున్నారు. వియత్నాం చెందిన ఓ మహిళ నెయిల్ ఆర్ట్ తో భారీగా సంపాదిస్తున్నారు. నెయిల్ పెయింట్ వేస్తూ దుబాయిలో నెలకు 40,000 దిర్హమ్స్ అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.10 లక్షలు ఆర్జిస్తున్నారు. 32 ఏళ్ల గుయెన్ ఫుయోంగ్ అన్హ్ 12 సంవత్సరాల క్రితం పుల్లా అనే బ్యూటీ పార్లర్ పని చేశారు.
ఈ క్రమంలోనే ఆమె పువ్వులు, జంతువులు, అలంకరణతో కూడిన క్లిష్టమైన 3డీ నెయిల్ ఆర్ట్ లో మంచి నైపుణ్యం సాధించారు. ఆమె ఆరు ఏళ్ల క్రితం వియత్నం నుంచి దుబాయ్ కి వలస వెళ్లారు. మొదట ఆమె ఓ ఉద్యోగం చేస్తూ జీవనం సాగించారు. ఆమె ఒక చిన్న సెలూన్‌లో రెండేళ్ల కాంట్రాక్ట్‌పై నెలకు కేవలం 3,500 దిర్హమ్స్ సంపాదిస్తూ పనిచేశారు. ఆమె కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత, ఫ్రీలాన్సింగ్‌లోకి అడుగు పెట్టారు. గతంలో క్లయింట్లతో ఉన్న పరిచయంతో పని సంపాదించుకున్నారు. నెలకు 30,000 దిర్హమ్స్ నుంచి 40,000 దర్హమ్స్ సంపాదించేవారు.

జూన్ 2026లో తనకున్న నెయిల్ ఆర్ట్ తో జుమేరా విలేజ్ సర్కిల్‌లో 'బ్యూటీ బై ఫుల్లా' అనే నెయిల్ సెలూన్‌ను ప్రారంభించారు. జీతం తీసుకోవడానికి బదులుగా, ఆమె జీతం ఇచ్చే స్థాయికి ఎదిగారు. అయితే ఆమె పొదుపు మంత్రం కూడా పాటించారు. సెలూన్ ఏర్పాటు చేయడం కంటే ముందు ఆమె ఒక స్నేహితురాలితో కలిసి స్టూడియో అపార్ట్‌మెంట్‌లో ఉండి, ఆ తర్వాత తన సొంత చిన్న స్టూడియోలోకి మారింది. ఆమె నెలకు కేవలం 6000 దిర్హమ్స్ మాత్రమే ఖర్చు చేసేది. ఇందులో ఆహారానికి 1000 దిర్హమ్స్, పెట్రోల్ కోసం 5,000 దిర్హమ్స్ కేటాయించేది. అంతే కాకుండా తన పెట్టుబడుల కోసం నెలనెలా 5000 దిర్హమ్స్ వియత్నాం పంపుతుండేది. ఈ క్రమంలోనే వియత్నంలో రెండు ఇళ్లను కొనుగోలు చేశారు.
గుయెన్ ఫుయోంగ్ అన్హ్ తన వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు. అబుదాబి, ఫుజైరాలో కూడా ఆమె బ్యూటీ బై ఫుల్లా సెలూన్ ఏర్పాటు చేయాడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆమె వచ్చే 20 ఏళ్లలో రిటైర్ కావాలనుకుంటున్నారని చెప్పారు. వియత్నాంలో మరిన్ని ఇళ్లు కొనుగోలు చేయాలని అన్నారు. 20 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ లో ఉంటూ కూరగాయాలు పండిస్తానని వివరించారు.


Click it and Unblock the Notifications