పవన్ గుంటుపల్లి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలుసు. కానీ ఈరోజు ర్యాపిడోను రూ.9,350 కోట్ల కంపెనీగా నిలబెట్టిన అతడు మొదట ఏకంగా ఏడు వ్యాపారాల్లో ఓడిపోయాడు. పెట్టుబడిదారులు 75సార్లు "నో" అన్నారు. కొందరు నవ్వుతూ బయటకు పంపారు. అయినా ఆయన నమ్మకం మాత్రం మారలేదు. "ఒక రోజు ఒక ఐడియా ఖచ్చితంగా క్లిక్ అవుతుంది!

ఐఐటీ నుంచి ఐడియాల వరకు తన కలని ఎలా సాధించాడో ఇన్ని అడ్డంకులు ఎలా తట్టుకోగలిగారో చూడం. తెలంగాణలో జన్మించిన పవన్, ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి గ్రాడ్యుయేట్ అయి, మొదటి ఉద్యోగం శాంసంగ్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా చేశాడు. కానీ ఆఫీస్ జీవితంలో ఆత్మసంతృప్తి లేదని తెలిసి, నిజమైన సమస్యల్ని పరిష్కరించాలనే పట్టుదలతో స్టార్టప్ దారిలోకి అడుగుపెట్టాడు. ఒకరోజు బెంగుళూరులో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయినప్పుడు, ఒక బైక్ మీద వెళితే ఎంత టైమ్ సేవ్ అవుతుందో ఊహించాడు. అదే ఆలోచన "Rapido"గా మారింది. ఇండియాలో తొలి బైక్ ట్యాక్సీ ఆప్!
ఆయన మొదటి స్టార్టప్ "theKarrier" విజయవంతం కాలేదు. అయినా ఆ తర్వత కూడా ఏడుసార్లు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించారు. కానీ ప్రతిసారి అవి మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. పెట్టుబడిదారులు కేవలం "నో" అనడమే కాదు, కొంతమంది నవ్వుతూ బయటకు పంపించేవారట. అప్పటికీ పవన్ నమ్మకం మాత్రం తగ్గలేదు. "ఒక రోజు ఓ ఐడియా ఖచ్చితంగా క్లిక్ అవుతుంది" అనే ఆశయంతో ఆయన అప్రయత్నంగా ముందుకు సాగాడు.
ఇతర క్యాబ్ కంపెనీలు మెట్రో నగరాలపై దృష్టిపెడుతున్నప్పుడు, Rapido మాత్రం చిన్న పట్టణాలవైపు అడుగులు వేసింది. విద్యార్థులు, ఉద్యోగులకు రూ.15 నుంచి ప్రారంభమైన తక్కువ ఛార్జీలతో బాగా నచ్చింది.
అలాగే, బైక్ డ్రైవర్లను "Captain" అంటూ గౌరవించడం ద్వారా ఓనర్‌షిప్ ఇచ్చింది. ఇవే చిన్నచిన్న వ్యూహాలు Rapidoను పెద్ద విజయానికి చేర్చాయి. Hero MotoCorp చైర్మన్ పవన్ ముంజాల్ మొదటగా పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి తర్వాత, Rapidoకి మరిన్ని వెంచర్ క్యాపిటల్స్ దగ్గర నుంచి ఫండింగ్ వచ్చింది. ఒక్క సంవత్సరం లోపే యూజర్లు లక్షల్లోకి చేరారు.
కొత్త పెట్టుబడులతో ర్యాపిడో బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్ వంటి ప్రధాన నగరాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. మొదటగా కేవలం 400 బైక్స్‌తో ప్రారంభమైన ఈ ప్రయాణం, సంవత్సరం చివరికి 1.5 లక్షల మంది యూజర్లకు చేరిన ఘనతను సాధించింది. ర్యాపిడో వ్యూహం స్పష్టంగా ఉంటుంది - ప్రారంభ దశలో రైడర్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయలేదు. డ్రైవర్లను "కెప్టెన్లు"గా పిలిచి వారికి గౌరవం మరియు ఓనర్‌షిప్ కలిగించే ప్రయత్నం చేసింది. ఇంకా, అత్యంత తక్కువ ధరలతో ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చి, ఓ విధమైన నమ్మకమైన యూజర్ బేస్‌ను నిర్మించింది.
ఇప్పటి రాపిడో 100కిపైగా నగరాల్లో సేవలు అందిస్తుంది. 5 కోట్ల యాప్ డౌన్‌లోడ్స్, 7 లక్షలకుపైగా యాక్టివ్ యూజర్లు దీని సేవలు వాడుకుంటున్నారు. బైక్ ట్యాక్సీలతో పాటు ఆటో, క్యాబ్ సేవలతో విస్తరణ జరుగుతుంది. "వందసార్లు 'నో' అనినా, ఒకసారి 'అవును' అంటే చాలు! అదే విజయం అని గట్టిగా నమ్మారు.
పవన్ కథ మనకి ఏం చెబుతుందంటే ఓడిపోవాలన్న ధైర్యం ఉంటేనే గెలిచే అవకాశాలూ వస్తాయి. ఐఐటీ పట్టభద్రుడిగా ఉన్నా, ఏడు వ్యాపారాల్లో నష్టపోయినా... అతడు తన కలను వదలలేదు. చివరికి అదే కల ర్యాపిడో రూపంలో వెలుగులోకి వచ్చింది. ప్రతి యువకుడూ ఈ కథను చదవాలి ఎందుకంటే ఇది కలలు ఎంత కష్టం ఉన్న సాధించాలి అని నమ్మకం ఇచ్చే పాఠం.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications