రోజుకి రోజుకి మారుతున్న బంగారం, వెండి ధరలు సామాన్యులకి కొనాల వద్ద అని ఆలోచనకి గురిచేస్తున్నాయి. అయితే బంగారం ధర మాత్రం తగ్గతూ పెరుగుతూ వస్తున్న గతంతో పోల్చుకుంటే పసిడి ధర భారీగా పెరిగింది. మరోపక్క బంగారానికి, బంగారు ఆభరణాలకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం బంగారం ధర 80వేలకీ దగ్గర ఉంటే వెండి మాత్రం లక్షకి చేరింది.
భారతదేశంలో ధరలు పెరగటంతో ప్రజలు ఖర్చులను అధిగమించడానికి అలాగే పెట్టుబడులు పెట్టడానికి బంగారం ధర పెంపును ఉపయోగించుకుంటుంన్నారు. ఇందుకు ప్రజలు ఎక్కువగా బ్యాంకుల నుండి గోల్డ్ లోన్ తీసుకుంటుండటంతో బ్యాంకుల్లో గోల్డ్ లోన్ విభాగం భారీగా వృద్ధి చెందింది.

బంగారం ధరలు పెరగడం, బ్యాంకులపై RBI కఠినమైన ఆంక్షల కారణంగా ప్రజలు బంగారంపై లోన్లు తీసుకోవడం కూడా పెరిగింది. అదేవిధంగా బ్యాంకులు కూడా బంగారం పై లోన్లు తక్కువ వడ్డీకే ఇస్తున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలలల్లో బ్యాంకుల్లో గోల్డ్ లోన్ల శాంక్షన్ దాదాపు 43.4 శాతం పెరిగింది. దీని ద్వారా కేవలం 2024 సెప్టెంబర్ నెలలో బంగారంపై రూ.1,47,081 కోట్ల లోన్లు మంజూరు చేసారు, అలాగే మార్చి 2024లో రూ.1,02,562 కోట్లు మాత్రమే. ఎన్‌బీఎఫ్‌సీలకు ఇచ్చిన లోన్లతో కలిపి ఒక్క సెప్టెంబర్‌లోనే రూ.3 లక్షల కోట్లకు పైగా శాంక్షన్ చేశారు. అయితే మొదటిది బంగారం ధరల పెరుగుదల బంగారంపై లోన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తుంది. బంగారం ధరలు పెరిగేకొద్దీ, లోన్-టు-వాల్యూ (LTV) రేషియో కూడా పెరుగుతుంది, బ్యాంకులు మీ బంగారు ఆభరణాలపై ఎక్కువగా లోన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది.
రెండవది, గోల్డ్ లోన్ సెగ్మెంట్‌లో కొన్ని లోపాల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆందోళనల నేపథ్యంలో బ్యాంకులు లోన్ ప్రమాణాలను కఠినతరం చేశాయి. ఫలితంగా, కస్టమర్లు నమ్మకమైన లేదా నమ్మదగినదిగా భావించే బ్యాంకుల వైపు మొగ్గు చూపుతున్నారు.
ముఖ్యంగా బంగారు లోన్లలో కింగ్‌మేకర్‌లుగా ఉన్న ఆర్థిక సంస్థలు (NBFCలు) కూడా ఈ విభాగం మొత్తం వృద్ధికి గణనీయంగా దోహదపడ్డాయి. ఈ రంగంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన ముత్తూట్ ఫైనాన్స్ మార్చి 2024 నాటికి రూ. 75,827 కోట్ల గోల్డ్ లోన్ ఆస్తులను నిర్వహిస్తోంది. కస్టమర్‌లు తాకట్టు పెట్టిన 188 టన్నుల బంగారం ఇక్కడ ఉంది.
గోల్డ్ లోన్ మార్కెట్‌పై RBI తాజగా ఆంక్షల వెనుక ప్రధాన కారణం NBFC ద్వారా నియమించిన 3rd పార్టీ కంపెనీలు, ఇవి ఎక్కువగా అక్రమాలు, గోల్డ్ లోన్లలో అక్రమాలకు పాల్పడటమే కాకుండా, క్లెయిమ్ చేయని బంగారంపై లోన్లు ఇవ్వడం, బంగారు ఆభరణాల తాకట్టు వేలం వేసేటప్పుడు నిబంధనలను ఉల్లంఘించడం ఆర్‌బీఐ నిఘాలో తేలింది.


Click it and Unblock the Notifications