ఒకప్పటి గోలి సోడా మీకు గుర్తుందా... వేసవిలో ఎండా వేడి నుండి చల్లబడడానికి ఇదొక చక్కటి పరిష్కారం. గోలిసోడా తయారీ చాల సింపుల్ ఇంకా పెద్దగా మెషినరీ అవసరం ఉండేది కాదు. ఇంకా దీని అమ్మకాలు, ధర ఆశించినంతలో ఉండేది. మీ చిన్నప్పటి రోజుల్లో ఎదో ఒక సందర్భంలో దీన్ని రుచి చూసే ఉంటారు. అయితే ఈ గోలీసోడా ఒకానొక మధ్య కాలంలో కనుమరుగైంది. పెప్సీ, కొకకోలా వచ్చాక ఈ గోలీసోడా మెల్లిమెల్లిగా మార్కెట్లో నుండి కనిపించకుండా పోయింది. కానీ ఈ కాలంలో గోలి సోడా బ్రాండ్ రూపంలో భారీగా పాపులర్ అవుతుంది. చెప్పాలంటే సూపర్ మార్కెట్లో మోస్ట్ డిమాండేడ్ ప్రోడక్ట్'లాగ మారింది.

ప్రత్యేకంగా ఈ భారతీయ పానీయం గోలీసోడాకి విదేశాలలో చాలా డిమాండ్ ఉంది. అవును, గోలీ సోడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ పొందింది. ఈ చారిత్రక పానీయాల బ్రాండ్ అమెరికా, బ్రిటన్ ఇంకా గల్ఫ్ దేశాల సూపర్ మార్కెట్లలో చేరడంతో ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ విభాగం అయిన వ్యవసాయ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) దీని గురించి సమాచారం ఇస్తూ, ప్రపంచంలోని ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లలో దీనికి బంపర్ డిమాండ్ ఉందని తెలిపింది.
అమెరికా, యుకె నుండి గల్ఫ్ దేశాలకు డిమాండ్: PTI నివేదిక ప్రకారం APEDA ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది, ఈ సాంప్రదాయ భారతీయ పానీయం కొత్త గోలి పాప్ సోడా బ్రాండ్ కింద ట్రయల్ కోసం అమెరికా, యుకె, యూరప్ ఇతర గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంది ఇంకా చాల సక్సెస్ అవుతున్నట్లు నిరూపించబడింది. గల్ఫ్ దేశాలలో ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియాతో అతిపెద్ద రిటైల్ చైన్‌లలో ఒకటైన లులు హైపర్‌మార్కెట్‌లో స్థానం సంపాదించుకుంది, అంటే దీని ప్రజాదరణ ఒక పెద్ద ఉదాహరణ. లులు అవుట్‌లెట్లలో వీటికి కస్టమర్ల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది.
స్ట్రీట్ బండ్ల నుండి సూపర్ మార్కెట్లకు : భారతీయ ఇళ్లలో ఒక వస్తువుగా మారిన గోలీ సోడా ఇప్పుడు గోలీ పాప్ సోడా అనే కొత్త గుర్తింపుతో మళ్లీ తనదైన ముద్ర వేస్తోంది. గోలిసోడా ఇకపై భారతదేశానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన పట్టును ఏర్పరుచుకుంటోంది.
UKలో నివేదికల ప్రకారం గోలీ పాప్ సోడా నోస్టాల్జియాను దాటి ఒక ట్రెండీ పానీయంగా అవతరించింది, అంతేకాదు ఈ ఆధునిక కాలంలో సాంప్రదాయ రుచిని కోరుకునే ప్రజల్లో ప్రజాదరణ పొందింది. మార్చి 17 నుండి 19 వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఫుడ్ & బెవరేజ్ ఈవెంట్ (IFE) లండన్ 2025లో APEDA గోలి పాప్ సోడాను కూడా ప్రదర్శించింది. ఈ వేదిక భారతీయ వ్యవస్థాపకులను ప్రపంచ కొనుగోలుదారులతో కనెక్ట్ అవ్వడానికి అండ్ భారతదేశ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ విస్తరణ ప్రదర్శించడానికి అవకాశాన్ని అందించింది.
గోలిల(marbles)తో తయారు చేసిన ఈ సోడా సీసా కేవలం సాఫ్ట్ డ్రింక్ మాత్రమే కాదు, భారతదేశ ఆహార వారసత్వాన్ని ఒక సీసాలో నింపిన కథ అని గమనించాలి. గోలీ పాప్ సోడా ప్రపంచవ్యాప్తంగా కొత్త అభిమానులకి పరిచయం అవుతూ దాహాన్ని తీర్చడం కంటే ఎక్కువే చేస్తోంది. స్వదేశీ రుచులు మల్టీనేషనల్ దిగ్గజాలతో కూడా నిలబడగలదని రుజువు చేస్తోంది. ఈ డ్రింక్ హైలెట్ విషయం ఏంటంటే దాని ప్యాకేజింగ్ దీనిని ఓపెన్ చేసేటప్పుడు వచ్చే పాప్ అప్ సౌండ్ ఇంకా దాని ఓపెన్ చేసే విధానం అద్భుతం. భారతీయుల్లో ప్రతి ఒక్కరి చిన్నతనం నుండి అన్ని వయసుల వారు ఇష్టపడే ఈ గోలిసోడా ఇప్పటికి కొన్ని మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications