Expensive Car: పెరుగుతన్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా విలాసాల కోసం భారీగా వెచ్చించే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. హాబీగా వివిధ బైక్స్, కార్లను గ్యారేజ్ లో ఉంచుకోవడం స్టేటస్ సింబల్ గా పలువురు భావిస్తారు. వీటి కొనుగోలు కోసం కోట్లను సైతం ఖర్చు పెట్టేందుకు పోటీ పడుతున్నారు.
అత్యధిక వేగంతో దూసుకుపోయే, ఖరీదైన స్పోర్ట్స్ కార్ల పట్ల పలువురు సినీ నటులు, క్రికెటర్లు ఎంతో మక్కువ చూపిస్తారు. ఈ విషయంలో ఫెరారీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇప్పటికే కొన్ని అరుదైన ఫీట్లను సైతం నెలకొల్పింది. తాజాగా 1962 ఫెరారీ 250 GTO ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫెరారీ కారుగా రికార్డు సృష్టించింది.

ఇటీవల వేలానికి ఉంచిన ఈ అరుదైన మోడల్ ధర ఏకంగా 430 కోట్లు పలికింది. సాధారణంగా ఇతర ఫెరారీ 250 GTOలు కూడా భారీ రేట్లకు అమ్ముడయ్యాయి. అయితే ఈ కారుకు ఓ ప్రత్యేకత ఉండటంతో ఇంత పెద్ద మొత్తం పలికినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ రేసింగ్ టీమ్ ప్రచారం నిర్వహించిన కారు ఇదే కావడం వల్ల ఈ ఫీట్ సాధ్యమైనట్లు పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
ఈ రికార్డుకు ముందు కూడా ఖరీదైన ఫెరారీ మోడల్ ఇదే కావడం గమనార్హం. ఇక అరుదైన మెర్సిడెజ్ 300 SLR ఉహ్లెన్ హాట్ కూపే.. ఇప్పటివరకు విక్రయించబడిన ప్రపంచంలోని అత్యంత విలువైన కారుగా నిలించింది. వేలంలో దీని ధర రికార్డు స్థాయిలో 1,108 కోట్లు పలికింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications