టాప్ కంపెనీల్లో జాబ్ చేసిన జంట – అమెరికా వదిలి ఇండియానే ఎందుకు ఎంచుకున్నారు?

మనలో చాలామంది "ఫ్యూచర్‌ బ్రైట్ కావాలంటే ఫారిన్ వెళ్ళాలి, అక్కడ టాప్ కంపెనీల్లో జాబ్ దొరికితే లైఫ్ సెట్" అనుకుంటారు. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం చేయడం అంటే మనకు డ్రీమ్‌లా ఉంటుంది. కానీ అక్కడే ఇప్పటికే పని చేసి, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి టాప్ కంపెనీల్లో అనుభవం సంపాదించిన వాళ్లు మాత్రం ఒకే మాట చెబుతున్నారు "ఇండియానే బెస్ట్". వాళ్లు చెబుతున్న అనుభవం మనకి ఒక రియాలిటీ చెక్ లాంటిది. డాలర్లు సంపాదించినా, లగ్జరీ లైఫ్ చూసినా, మన ఇల్లు, మన ఫ్యామిలీ, మన కల్చర్ ఇచ్చే ఆనందం ఎక్కడా దొరకదని వాళ్ల మాట.

- IT H-1B India is best Relocation to India Rising IT salaries Startup ecosystem Tech India level up H-1B issues Family connection Mental peace

కొన్నాళ్ళ ముందు ITలో జాబ్ అంటే US వెళ్తేనే మంచి జీతం వస్తుందని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ గ్యాప్ చాలా తగ్గిపోయింది. ఇండియాలోనే IT sectorలో జీతాలు బాగా పెరిగాయి, కొన్ని రోల్స్‌లో USతో పోలిస్తే అంతే స్థాయిలో లేదా దాని దగ్గర్లోనే ప్యాకేజీలు వస్తున్నాయి. స్టార్టప్స్, MNCలు, రిమోట్ వర్క్ కల్చర్ అన్నీ కలిపి ఇండియాలో టాలెంట్‌కి డిమాండ్ పెరగడంతో సాలరీలు కూడా కొత్త లెవెల్‌కి వెళ్లాయి. అందుకే చాలామంది "బయటకన్నా ఇక్కడే better" అనిపిస్తోంది.

హేమంత్-వాషు స్టోరీలో క్లియర్ మెసేజ్ ఉంది. మంచి జీతం, బ్రాండ్ నేమ్ జాబ్‌లు ఉన్నా, ఫ్యామిలీతో కనెక్ట్,పెరుగుతున్న అవకాశాలు, మెంటల్ పీస్ ఎక్కువ ముఖ్యం.

ఇప్పుడు వీరు బెంగళూరులో సెటిల్ అవుతూ, కొత్త అవకాశాలను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. ఇండియాలో టెక్ ఫీల్డ్ పెరుగుతుందన్న నమ్మకం వీరి రీ-లోకేషన్‌ను మరింత బలపరిచింది.

వీళ్లు 2016లో న్యూయార్క్‌లోని స్టోనీ బ్రుక్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతూ కలుసుకున్న హేమంత్, వాషు 2020లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచే "ఎప్పుడో ఒక రోజు ఇండియాకు తిరిగి వెళ్ళాలి" అనే ప్లాన్ మెదడులో ఫిక్స్ అయిపోయింది.

చదువు పూర్తయ్యాక వాషు IBM, Meta, Google‌లో పని చేసింది. హేమంత్ Tesla, SAP, Salesforce, Meta లాంటి కంపెనీల్లో పనిచేశాడు. అంటే వీరిద్దరి రిజ్యూమేలు టాప్ లెవెల్. అయినా, వీళ్లను ఇండియాకు లాగిన 5 ప్రధాన కారణాలు ఉన్నాయి.

1️. వాషుకి పెద్ద కారణం ఫ్యామిలీ. "అమ్మ రిటైర్మెంట్, కజిన్స్ వెడ్డింగ్స్, పండగలు... ఇవన్నీ మిస్ అవ్వడం నాకు అసలు నచ్చలేదు. వాళ్ల దగ్గరగా ఉండాలని ఎప్పుడూ అనిపించేది" అని ఆమె చెబుతుంది.

2️. వీరిద్దరూ గమనించిన మరో విషయం ఇండియాలో టెక్ రంగం ఎంత వేగంగా మారిపోయిందో. "Big Tech కంపెనీలు ఇండియాలో కొత్త టీమ్స్ క్రియేట్ చేస్తున్నాయి, ప్రోడక్ట్స్ డెవలప్ అవుతున్నాయి, జీతాలు కూడా పోటీగా పెరుగుతున్నాయి" అని వాషు చెబుతుంది.

3️. US‌లో పని చేస్తూ ఇద్దరూ బాగా సేవింగ్స్ చేసుకున్నారు. "ఫైనాన్షియల్‌గా కంఫర్ట్ ఉన్నాం కాబట్టి రిస్క్ తీసుకునే ధైర్యం వచ్చింది" అంటున్నారు.

4️. H-1B వీసా అనే గట్టి గోడ వీరిద్దరినీ బాగా ఇబ్బంది పెట్టింది. "సైడ్ ప్రాజెక్ట్స్ చేయలేము, కేరియర్ బ్రేక్ తీసుకోలేము. పైగా వేరే సైకిల్‌లో ఉండటం వల్ల కలిసి ఇండియాకు రావడం కూడా కష్టమయ్యేది" అని హేమంత్ చెబుతున్నాడు.

⃣5. US ఇమిగ్రేషన్ సిట్యుయేషన్ మరింత అన్‌ప్రెడిక్టబుల్ అవ్వడంతో, ఎప్పుడూ "ఏదైనా చిన్న తప్పు జరిగితే డిపోర్ట్ అవుతామేమో" అన్న టెన్షన్ ఉండేది.

ఒకప్పుడు ఇండియా అంటే జాబ్స్ కోసం బయటకు వెళ్లాల్సిన దేశం అన్న పేరుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇండియా స్వయంగా ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్న హబ్‌గా మారింది. వీరి మాటల్లో చెప్పాలంటే, కేవలం 8 ఏళ్లలోనే టెక్ ఇండియా ఒక లెవెల్ లోకి వెళ్ళిపోయింది. ఈ మార్పుకి కారణం కూడా స్పష్టంగానే కనిపిస్తోంది. స్టార్టప్ ఎకోసిస్టమ్ బలపడింది, కొత్త ఆవిష్కరణలకు తలుపులు తెరచాయి, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఫండింగ్ పెట్టారు. ఫిన్‌టెక్ నుంచి ఎడ్టెక్ వరకు, హెల్త్‌టెక్ నుంచి AI స్టార్టప్స్ వరకు ప్రతి రంగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి. అందుకే బయట జాబ్ చేసి అనుభవం సంపాదించిన వాళ్లు కూడా ఇప్పుడు "ఇండియా సరైన ప్రదేశం" అని చెబుతున్నారు.

మొత్తానికి, US లైఫ్ గ్లామరస్ అయినా, "ఇంటి దగ్గర ఉండటం మన కల్చర్, మన విలువలు, మనసుకి పీస్ ఇచ్చే లైఫ్" కోసం ఈ జంట చేసిన నిర్ణయం చాలా మందికి ఇన్స్పిరేషన్ కావచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+