Multibagger Stock: గత కొంత కాలంగా కెమికల్ సెక్టార్ లోని అనేక స్టాక్స్ ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందిస్తున్నాయి. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవటంతో కంపెనీలు కొత్త ఎత్తులకు ఎదుగుతూ.. తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తున్నాయి. అయితే ఈ స్టాక్ మాత్రం తన పెట్టుబడిదారులను ఏకంగా కోటీశ్వరులను చేసేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

మల్టీబ్యాగర్ కెమికల్ స్టాక్..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది UPL Ltd స్టాక్ గురించే. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.58,671.05 కోట్లుగా ఉంది. కంపెనీకి 138 దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఆహార సరఫరాలో 90% కంపెనీ పరిధిలోనే ఉంది. జీవసంబంధమైన, పంటల రక్షణ, విత్తన శుద్ధి, పంట అనంతర పరిష్కారాలతో సహా అనేక రకాల వ్యవసాయ పరిష్కారాలను కంపెనీ అందిస్తోంది. IOT వంటి నూతన సాంకేతికతను కంపెనీ ప్రస్తుతం అంతర్జాతీయంగా అందిస్తోంది. దీర్ధకాలం పాటు పెట్టుబడులను కొనసాగిస్తే ఇన్వెస్టర్లు ఎలా కోటీశ్వరులు కావచ్చో నిరూపించటానికి ఈ స్టాక్ సరైన ఉదాహరణ.

UPL లిమిటెడ్ స్టాక్ ధర చరిత్ర..
ఎన్‌ఎస్‌ఈలో యూపీఎల్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్ ముగిసేసరికి రూ.767.80 వద్ద ఉన్నాయి. జూలై 5, 2002న స్టాక్ ధర కేవలం రూ.1.20 వద్ద ఉంది. ఇది ఆల్-టైమ్ హై 63,883.33%తో భారీ మల్టీబ్యాగర్ రాబడిని సూచిస్తుంది. 20 ఏళ్ల కాలంలో లక్ష పెట్టుబడిని ఈ స్టాక్ రూ.6.39 కోట్లుగా మార్చేసింది. ఈ స్టాక్ గత ఐదేళ్లలో 38.31%, గత సంవత్సరంలో 6.79% లాభపడింది.

బలంగా ఆర్థిక ఫలితాలు..
కంపెనీ బలమైన ఆర్థిక ఫలితాలను నివేదించింది. 2023 ఆర్థికత సంవత్సరం మెుదటి త్రైమాసికంలో రూ.10,821 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. గడచిన సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.8,515 కోట్లుగా ఉంది. ఈ కాలంలో కంపెనీ వ్యాపారం దాదాపు 27 శాతం మేర పెరిగాయి. Q1FY23లో కంపెనీ మొత్తం ఖర్చులు రూ.9,782 కోట్లకు చేరుకున్నాయి. జూన్ 30 2022తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.877 కోట్లుగా ఉంది. Q1FY23లో కంపెనీ రూ.816 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తన ఆర్థిక ఫలితాల్లో వెల్లడించింది.

బ్రోకరేజ్ సంస్థల మాటేంటి.. కొనొచ్చా..?
అయితే ఇప్పటికీ ఈ స్టాక్ పై పెట్టుబడి పెట్టొచ్చా అని అనేక మందికి అనుమానం కలగవచ్చు. ఈ విషయంలో బ్రోకింగ్ సంస్థ జియోజిత్ ఏమంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కంపెనీ రాబోయే త్రైమాసికాల్లో బలమైన వృద్ధిని నమోదు చేస్తుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం స్టాక్ కు రూ.880 టార్గెట్ ధరతో BUY రేటింగ్‌ను జియోజిత్ అందిస్తోంది. ఈ స్టాక్ విషయంలో బ్రోకింగ్ సంస్థ చోలా వెల్త్ డైరెక్ట్ రీసెర్చ్ కూడా సానుకూలంగానే ఉంది. UPL తన పరిశ్రమలో అగ్రగామి స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందన్న బ్రోకరేజ్.. స్టాక్ కు రూ.1,050 టార్గెట్ ధరతో BUY రేటింగ్‌ను ఇచ్చింది. కాబట్టి వినియోగదారులు దీనిలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు సదరు బ్రోకరేజ్ కంపెనీల అంచనాలు చెబుతున్నాయి.
NOTE: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీని ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. మీ ఆర్థిక సలహాదారు నిపుణుల సలహాలను తీసుకోండి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications