ఈ ఉబర్ డ్రైవర్ సంపాదన ముందు ఐటీ ఎంప్లాయ్ జీతం కూడా జుజుబీ.. వైరల్ వీడియో..
చదువు పూర్తి అయిపోయాక ఎదో ఒక ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు, ఒకోసారి చాలీ చాలని జీతంతో కూడా జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. అయితే డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్న అందులో మనకు అనుకూలమైన మార్గం దొరకడం కష్టం. ఈ రోజుల్లో ఒక సామాన్యుడు ఒక చేతితో సంపాదించిన మొత్తం కుటుంబ పోషణకే సరిపోతుంటుంది. తాజాగా సోషల్ ఇండియాలో డబ్బు సంపాదనకి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం చెక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియో నెట్టింట్లో చర్చకు కూడా దారి తీసింది. అసలు విషయం చూస్తే ఈ వీడియోలో ఉన్నది ఒక ఉబెర్ డ్రైవర్. కానీ అతని సంపాదన విని అందరు నమ్మలేకపొతున్నారు. ఒక ఉబెర్ డ్రైవర్ సంపాదన ఇంత ఉంటుందా అని నెటిజన్లు షాకవుతున్నారు.
సాధారణంగా ఓక ఓలా లేదా ఉబర్ డ్రైవర్ ఎంత సంపాదిస్తాడో ఒక అంచనా వేయొచ్చు కానీ ఈ బెంగుళూరు ఉబర్ డ్రైవర్ సంపాదన అక్షరాల 80వేల పైనే. అవును మీరు విన్నది నిజమే... ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించాడు. ఒక రోజుకు 13 గంటలు పనిచేసే ఈ డ్రైవర్ నాపై ఎవరి ఒత్తిడి లేదు, నేనే ఇక్కడ ఓనర్‌ని అంటూ తెలిపారు. ఈ వీడియోలో ఉబర్ బైక్ డ్రైవర్ హిందీలో మాట్లాడుతున్నట్లు చూడవచ్చు.

వీడియోలో "లోగో కో బటాయేంగే తో వో హసేంగే. ఇత్నీ శాలరీ ఎంఎన్సి కంపెనీ వాలే భీ నహీ దేతే. మై అప్నీ మర్జి సే కామ్ కర్ రహా హు. మేరా జబ్ మాన్ కరేగా టాబ్ జాకర్ సో సక్తా హు. (నా సంపాదన గురించి జనాలకు చెబితే నవ్వుకుంటారు. ఎంఎన్సి వాళ్ళు కూడా అంత జీతం ఇవ్వరు. అన్నింటికీ మించి నా ఇష్టం మేరకు నేను ఈ పని చేస్తున్నాను. నాకు నచ్చినప్పుడల్లా నిద్రపోతాను.) అని అన్నాడు.
టీ అమ్మేవారు లేదా సమోసాలు ఇంకా పానీ పూరి అమ్మడం లాంటి వీధి వ్యాపారుల ఆదాయాలు చూసి కార్పొరేట్ ఉద్యోగులుసైతం ఆశ్చర్యపోతున్నారు. అందుకే ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అవుతాయి. Xలో ఒక యూజర్ ఈ వీడియోపై " చాల ఇన్స్పిరేషన్గా ఉంది, కానీ ఆశ్చర్యకరమైనది హిందీలో మాట్లాడటం." అంటూ పోస్ట్ చేసారు. మరొక X యూజర్ "భారతీయులు అర్థం చేసుకోవాలి, పని పట్ల గౌరవం ముఖ్యం. ప్రజలు పేదలుగా కనిపించడం లేదా చిన్న పనులు చేయడం వల్ల వారిని తక్కువగా చూస్తారు. భారతదేశం త్వరలో మంచిగా మారుతుందని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేసారు.


Click it and Unblock the Notifications