For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Penny Stock: లక్షను రూ.94 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్.. 70 ఏళ్లుగా వ్యాపారం.. ప్రపంచంలోనే..

|

Multibagger Stocks: ఒకసారి అమెరికన్ బిలియనీర్ ఇన్వెస్టర్ డబ్బు అనేది స్టాక్‌ మార్కెట్ పెట్టుబడుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. షేర్లను కొనటం, అమ్మటంలో కాదు.. ఇన్వెస్ట్ మెంట్ చేసి దీర్ఘకాలం వేచి ఉండటంలో లాభాలు ఉంటాయని అన్నారు. ఓపిక ఉంటే మీరు స్టాక్ మార్కెట్ నుంచి మిలియనీర్ కూడా కావచ్చు. అందువల్ల.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు చాలా కాలం పాటు స్టాక్‌ను హోల్డ్ చేయటానికి ప్రయత్నించాలి. ఈరోజు మేము మీకు చెబుతున్న స్టాక్ దాని పెట్టుబడిదారులకు చాలా కాలంగా అద్భుతమైన రాబడిని అందించింది. దీర్ఘకాలంలో ఈ పెన్నీ స్టాక్ మల్టీబ్యాగర్ రాబడులను అందించింది.

స్టాక్ వివరాలు..

స్టాక్ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది HLE గ్లాస్‌కోట్ కంపెనీ షేర్ గురించే. ఈ మిడ్ క్యాప్ స్టాక్ ధర గత 15 ఏళ్లలో రూ.33 నుంచి రూ.3,107 స్థాయిలకు పెరిగింది. అంటే ఈ కాలంలో దాదాపు తన ఇన్వెస్టర్లకు 9,300 శాతం రాబడిని తెచ్చిపెట్టింది. బీఎస్ఈలో ఈ స్టాక్ ఆల్ టైమ్ గరిష్ఠ ధర రూ.7,549గా ఉంది. ఇదే సమయంలో ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.2,951.30గా ఉంది. ఈ స్టాక్ తన దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు గొప్ప రాబడిని అందించిన చరిత్రను కలిగి ఉంది.

పెరిగిన స్టాక్ ధర..

పెరిగిన స్టాక్ ధర..

గత 5 సంవత్సరాల్లో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ రూ.160 నుంచి రూ.3107 స్థాయికి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 1850 శాతం పెరుగుదల నమోదైంది. అదేవిధంగా.. గత 10 సంవత్సరాల్లో స్టాక్ దాదాపు రూ.36 స్థాయి నుంచి ఒక్కో షేరుకు రూ.3,107 స్థాయికి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 8530 శాతం వృద్ధి నమోదైంది. స్టాక్ 15 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ గమనించినట్లయితే.. ఒక్కో షేరు ధర రూ.33 నుంచి రూ.3,107కి చేరుకుంది. ఈ కాలంలో షేర్ ధర దాదాపు 94 రెట్లు పెరిగింది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

HLE Glascoat Limited కంపెనీ రసాయన, ఔషధ పరిశ్రమల కోసం ప్రాసెస్ పరికరాల ప్రముఖ తయారీదారుగా ఉంది. కంపెనీ ఫిల్ట్రేషన్, డ్రైయింగ్ ఎక్విప్‌మెంట్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంది. గ్లాస్ లైన్డ్ ఎక్విప్‌మెంట్‌ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా కంపెనీ కొనసాగుతోంది. కంపెనీ 1951 నుంచి 70 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉంది.

లక్ష పెట్టుబడి పెడితే రూ.94 లక్షలు..

లక్ష పెట్టుబడి పెడితే రూ.94 లక్షలు..

HLE Glasscoat ఈ స్టాక్‌లో ఏడాది క్రితం రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ.90 వేలుగా ఉండేది. ఐదేళ్ల క్రితం లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు దాదాపు రూ.19.50 లక్షలు రాబడి వచ్చేది. పది సంవత్సరాల క్రితం లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రూ.89.30 లక్షల రాబడి వచ్చేది. అదే 15 ఏళ్ల కిందట ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి.. దానిని కొనసాగించినట్లయితే ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం రూ.94 లక్షల ఆదాయం వచ్చి ఉండేది.

English summary

Penny Stock: లక్షను రూ.94 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్.. 70 ఏళ్లుగా వ్యాపారం.. ప్రపంచంలోనే.. | this 70 yrs old company turned one lakh to 94 lakhs know full details

HLE Glascoat Limited stock turned one lakh into 94 lakhs in long term gave multibagger returns
Story first published: Sunday, July 31, 2022, 11:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X