Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..!
కొత్త మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. మొదటిసారి పెట్టుబడి పెట్టే వారికి సరైన పథకాన్ని ఎంచుకోవడం కష్టంగా ఉంటుంది. లార్జ్-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్, హైబ్రిడ్, డెట్ కేటగిరీలలో వందలాది మ్యూచువల్ ఫండ్ పథకాలు ఉన్నాయి. వీటిలో ఎందులో పెట్టుబడి పెట్టాలో అర్థం కాదు. ఒక్కో ఫండ్ కు ఒక్కో రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉండొద్దని అనుకున్న వారు డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రిస్క్ తీసుకునే వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చని సూచిస్తున్నారు.
మొదటగా తక్కువ రిస్క్ ఉండే ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిదని వివరిస్తున్నారు. ఇండెక్స్, లార్జ్ క్యాప్ ఫండ్లలో రిస్క్ కాస్త తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కొత్త పెట్టుబడిదారులు కేవలం ఇటీవల అత్యధిక రాబడిని ఇచ్చిందనే కారణంతో ఒక ఫండ్‌ను ఎంచుకునే సాధారణ షార్ట్‌కట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ కేవలం గత పనితీరు మాత్రమే ఒక ఫండ్ వారి ఆర్థిక లక్ష్యానికి సరిపోతుందో లేదో తెలుసుకోవాలి. మొదటిసారి పెట్టుబడి పెట్టే వారు ముందు మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది ఆర్థిక లక్ష్యం. దానిని సాధించడానికి అందుబాటులో ఉన్న సమయం.

రెండోది పోర్ట్‌ఫోలియోలో తగ్గుదలను తట్టుకునే పెట్టుబడిదారుడి సామర్థ్యం. పెట్టుబడిదారులు తాము ఎంతవరకు తట్టుకోగలమని చెప్పుకుంటున్నారో దానిని కాకుండా, క్లిష్టమైన మార్కెట్ దశలో వారి పోర్ట్‌ఫోలియో 20-25% తగ్గితే వాస్తవానికి ఎలా స్పందిస్తారో అంచనా వేయాలి. ఒక ఫండ్ చారిత్రక రాబడులు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ మొదటి పెద్ద దిద్దుబాటు సమయంలోనే పెట్టుబడిదారుడు దాని నుంచి నిష్క్రమించే అవకాశం ఉన్న ఫండ్ వారికి సరైనది కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మూడోది ఫండ్ పనితీరు, వ్యయంతో సహా ఆ ఫండ్ గురించే ఆలోచించాలి. పెట్టుబడిదారుడు తమ లక్ష్యాన్ని, రిస్క్ తట్టుకునే సామర్థ్యాన్ని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఈ అంశాలను పరిగణించాలని చెబుతున్నారు.
ఒకటి లేదా రెండు సంవత్సరాలలో అవసరమయ్యే డబ్బు కోసం డెట్ ఫండ్‌లు సరిపోతాయని వివరిస్తున్నారు. అయితే రెండు నుంచి మూడు సంవత్సరాల కోసం హైబ్రిడ్ ఫండ్‌లు సముచితంగా ఉండవచ్చు. ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న లక్ష్యాలకు ఈక్విటీ ఫండ్‌లు బాగా సరిపోతాయని వివరిస్తున్నారు. ఈక్విటీలో కొత్త పెట్టుబడిదారులకు లార్జ్-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్లలో ఎక్కువగా పెట్టుబడి పెట్టి.. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ ఫండ్లలో తక్కువ పెట్టుబడి పెడితే మంచిదని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications