Home Loans: సొంత ఇల్లు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కల కంటారు. అయితే వాస్తవంగా దాన్ని నిజం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకోకుండా గృహ కొనుగోలు అనేది మధ్యతరగతి ప్రజలకు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇది అత్యంత దీర్ఘకాలిక లోన్ కావడంతో, తీసుకునే ముందే వడ్డీరేట్లు సహా పలు ఇతర విషయాల గురించి క్షుణ్ణంగా అవగాహన ఉండాలి.
గృహ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు రెడీగానే ఉన్నా, వడ్డీరేట్లు చూస్తే భయం వేయక మానదు. వీటిలోనూ ఫ్లోటింగ్ లేదా స్థిరమైన వడ్డీరేట్లు అనే రెండు రకాలు ఉన్నాయి. ఇవి ప్రత్యక్షంగా EMIపైనా, తిరిగి చెల్లించే పూర్తి మొత్తంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే వీటిని ఎంచుకునే ముందు అప్రమత్తంగా వ్యవహరిచాలి.

ఫ్లోటింగ్ వడ్డీ రేటు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతూ ఉంటుంది. బేస్ రేటు మారిన వెంటనే వడ్డీ రేటు సవరించబడుతుంది. ఇక స్థిర రేటులో రుణం వ్యవధి మొత్తంలో వడ్డీ రేటు మార్పు ఉండదు. తద్వారా EMI చెల్లింపులను ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. స్వల్పకాలంలో స్థిర వడ్డీ రేటు అనుకూలంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఫ్లోటింగ్ రేటే బెటర్ అని విశ్లేషకులు చెబుతున్నారు.
స్థిర వడ్డీరేట్ల కంటే ఫ్లోటింగ్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉండటంతో హెచ్చు తగ్గులు తాత్కాలికమేనని గమనించాలి. రుణగ్రహీతలకు స్థిర రేటు మనశ్శాంతిని అందజేస్తుంది. నిర్ణయించిన కాలానికి వడ్డీ రేటుతో పాటు హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications