Gold Robbery: తమిళనాడులో దొంగలు కలకలం సృష్టించారు. గ్రాముల్లో కాదు ఏకంగా కేజీల్లో పసిడిని దోచేసి అటు బంగారు దుకాణం యజమానికి, ఇటు పోలీసులకు పెద్ద పరీక్ష పెట్టారు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కోయంబత్తూరులోని జోస్ అలుక్కాస్ సంస్థకు చెందిన గాంధీపురం బ్రాంచ్ లో దొంగలు పడ్డారు. ఈ క్రమంలో వారు ఏకంగా పాతిక కేజీల పసిడి ఆభరణాలను దోచేయటం సంచలనంగా మారింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి షాపు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అర్థరాత్రి చిమ్మచికటిలో 2.30 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లు వారు గుర్తించారు.

ప్రస్తుతం కోయంబత్తూరు పోలీసులు కేసులు చాలెంజింగ్ గా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం వారు ఒక వ్యక్తిపై అనుమానంతో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని చెప్పారు. సోమవారం ఎప్పటిలాగే షాపు మూసిన ఉద్యోగులు తెల్లవారిన తర్వాత షోరూమ్ తెరిచి చూడగానే ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. పూర్తిగా పరిశీలించగా షోరూమ్ వెనుక వైపు దొంగలు ఎయిర్ కండీషనర్ వెంటిలేటర్ ద్వారా స్టోర్‌లోకి ప్రవేశించినట్లు వెల్లడైంది. దీంతో వారు వెంటనే కంపెనీలోని అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.
ప్రస్తుతం మార్కెట్ లెక్క ప్రకారం వీటి విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 200 సవర్ల బంగారం మాయం కావటంపై పోలీసులు శాస్త్రీయ ఆదారాలైన వేలిముద్రలు సేకరించారు. అలాగే స్నిఫర్ డాక్స్ తో గాలింపు చేశారు. ఈ సమయంలో దుకాణంపైన 12 మంది కార్మికులు నిద్రిస్తున్నప్పటికీ ఈ విషయం గురించి తమకేమి తెలియని వెల్లడించారు.
దుకాణంలో సీసీ కెమెరాలు ఉన్నాయని.. అయితే అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తం చేయడానికి అలారం లేదని పోలీసులు తెలిపారు. అలాగే షోరూం మొత్తానికి ఒక్కరే సెక్యూరిటీ ఉన్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications