స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనడం కొనేందుకు బెత వేస్తుంటాం... కానీ ఆ షేర్ ఎంతకాలంలో రాబడి ఇస్తుంది అని చెప్పలేం. ఇవన్నీ కూడా ప్రపంచ రాజకీయాలు సహా ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటు నిరంతరం క్షీణిస్తోంది. మరోవైపు మార్కెట్ పడిపోతున్న కూడా కొన్ని కంపెనీల షేర్లు మల్టీబ్యాగర్‌లుగా మారాయి. అలాంటి ఒక కంపెనీ షేర్లు కొంతకాలంగా పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇస్తున్నాయి.
అలాగే కొన్ని సంవత్సరాలలోనే పెట్టుబడిదారులను లక్షాధికారులను చేసింది. ఈ కంపెనీ పేరు పిటిసి ఇండస్ట్రీస్ లిమిటెడ్. నిన్న శుక్రవారం ఈ స్టాక్ 3 శాతం లాభంతో రూ.12249 వద్ద ముగిసింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గత కొన్ని రోజులుగా నిరంతరం పెరుగుతోంది. ఇక ఈ వారం గురించి మాట్లాడుకుంటే సోమవారం అంటే మార్చి 3 నుండి శుక్రవారం అంటే మార్చి 7 వరకు ఈ స్టాక్ 18 శాతానికి పైగా పెరిగింది. దీర్ఘకాలంలో చూస్తే ఈ షేర్ రూ.1 లక్షను రూ.1 కోటిగా మార్చింది.

6 నెలల్లో నష్టం: గత ఒకటి, రెండు లేదా ఆరు నెలల్లో ఈ స్టాక్ రాబడిని పరిశీలిస్తే నష్టాలను ఇచ్చింది అని చెప్పవచ్చు. అలాగే ఒక నెలలోనే ఈ స్టాక్ 15 శాతానికి పైగా పడిపోయింది. ఈ సంవత్సరం కూడా ఎటువంటి రాబడి ఇవ్వలేదు. జనవరి 1 నుండి 7 శాతానికి పైగా తగ్గింది. ఆరు నెలల్లో చూస్తే కూడా ఎలాంటి రిటర్న్ ఇవ్వలేదు. అంతేకాకుండా 6 నెలల్లో దాదాపు 14 శాతం తగ్గింది.
ఒక సంవత్సరంలో అద్భుతమైన రాబడి : ఈ స్టాక్ ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చింది. ఒక సంవత్సరం క్రితం దీని ధర రూ. 8169. ఇప్పుడు రూ.12249. ఈ లెక్కన చూస్తే ఒక సంవత్సరంలో దాదాపు 50 శాతం రాబడిని ఇచ్చింది. అంటే, ఒక సంవత్సరం క్రితం లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి వారికీ లక్షన్నర రూపాయలుగా మార్చింది.
5 సంవత్సరాలలో లక్షాధికారి: ఈ స్టాక్ 5 సంవత్సరాలలో పెట్టుబడిదారులను లక్షాధికారులను చేసింది. 5 సంవత్సరాల క్రితం షేరు ధర దాదాపు రూ.123 ఉండేది. ఇక ఈ 5 సంవత్సరాలలో 9858 శాతం రాబడిని ఇచ్చింది. మీరు 5 సంవత్సరాల క్రితం ఇందులో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఆ రూ.1 లక్ష విలువ నేడు దాదాపు రూ.1 కోటి ఉండేది.
కంపెనీ వ్యాపారం ఏంటి : ఈ కంపెనీ ఏరోస్పేస్, డిఫెన్స్, ఆయిల్ & గ్యాస్, పవర్, సముద్ర పరిశ్రమలకు హై-టెక్ కాస్టింగ్ అండ్ డిజైన్ సొల్యూషన్స్ అందిస్తుంది. డిసెంబర్ 2024 త్రైమాసికంలో కంపెనీ అపారమైన లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 76 శాతం పెరిగి రూ.14.24 కోట్లకు చేరుకుంది. BSE అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.18,354.13 కోట్లు.


Click it and Unblock the Notifications