ఈ స్టాక్స్ కొన్నవారికి 3 ఏళ్ల నుంచి డబ్బులే డబ్బులు.. ఎంత లాభం వచ్చిందంటే..
గత మూడు సంవత్సరాల్లో భారతీయ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచిక అయిన సెన్సెక్స్ సుమారు 50% వృద్ధి రేటును సాధించింది. ఈ బలమైన మార్కెట్ ర్యాలీలో అనేక స్టాకులు అసాధారణంగా పెరిగి, పెట్టుబడిదారుల సంపదను భారీగా పెంచాయి.
ముఖ్యంగా, రూ. 10,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన ప్రముఖ కంపెనీలలో 11 స్టాకులు మూడు సంవత్సరాల్లో 1000% కంటే ఎక్కువ రాబడిని అందించాయి. ఈ షేర్లు కొన్న వారు గత మూడేళ్ల నుంచి లాభాల బాటలో నడిచారు. అలాంటి స్టాక్స్ గురించి మనం ఓ సారి తెలుసుకున్నట్లయితే.

అద్భుత రాబడులిచ్చిన 11 స్టాకులు:
1. Transformers & Rectifiers (India)
స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు కొన్న వారు లాభాలను పొందారు. ఈ కంపెనీ షేర్లు గత మూడేళ్లలో 3,201% వృద్ధి రేటు సాధించింది. రూ. 15 కి పెట్టుబడుదారులు కొనుగోలు చేయగా ఇప్పుడు 508కి షేర్ వాల్యూ పెరిగింది. 52-వారాల గరిష్ఠానికి 650 వరకు చేరుకుంది.
2. Mazagon Dock Shipbuilders
స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు కొన్న వారు లాభాలను పొందారు. ఈ కంపెనీ షేర్లు గత మూడేళ్లలో 2,258% పెరుగుదల నమోదు చేసింది. రూ. 148 కి పెట్టుబడుదారులు కొనుగోలు చేయగా ఇప్పుడు 3,500 కి షేర్ వాల్యూ పెరిగింది. 52-వారాల గరిష్ఠానికి రూ. 3,737 వరకు చేరుకుంది.
3. Inox Wind Energy
స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు కొన్న వారు లాభాలను పొందారు. ఈ కంపెనీ షేర్లు గత మూడేళ్లలో 1,745% లాభం నమోదు చేసింది. రూ. 577 కి పెట్టుబడుదారులు కొనుగోలు చేయగా ఇప్పుడు రూ. 10,641కి షేర్ వాల్యూ పెరిగింది. 52-వారాల గరిష్ఠానికి రూ. 14,000 వరకు చేరుకుంది.
4. GE Vernova T\&D India
స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు కొన్న వారు లాభాలను పొందారు. ఈ కంపెనీ షేర్లు గత మూడేళ్లలో 1,730% లాభం నమోదు చేసింది. రూ. 102 కి పెట్టుబడుదారులు కొనుగోలు చేయగా ఇప్పుడు రూ. 2,216కి షేర్ వాల్యూ పెరిగింది. 52-వారాల గరిష్ఠానికి రూ. 2,216 వరకు చేరుకుంది.
5. Waaree Renewable Technologie
₹67 నుండి ₹1,016కి - 1,417% లాభం
గరిష్ఠం: ₹2,513
6. Authum Investment & Infrastructure
₹158 నుండి ₹2,199కి - 1,292% పెరుగుదల
గరిష్ఠం: ₹2,278
7. Rail Vikas Nigam (RVNL)
₹32 నుండి ₹405కి - 1,173% వృద్ధి
గరిష్ఠం: ₹647
8. Apar Industries
₹631 నుండి ₹7,656కి - 1,114% లాభం
గరిష్ఠం: ₹11,797
9. Cochin Shipyard
₹162 నుండి ₹1,904కి - 1,075% పెరుగుదల
గరిష్ఠం: ₹2,977
10. PG Electroplast
₹67 నుండి ₹756కి - 1,021% వృద్ధి
గరిష్ఠం: ₹1,055
11. Zen Technologies
₹171 నుండి ₹1,887కి - 1,004% లాభం
గరిష్ఠం: ₹2,628
ఈ స్టాకులు పెట్టుబడిదారులకు తక్కువ సమయంలో భారీ రాబడులు ఇచ్చినవే కాక, మార్కెట్‌లో తమ స్థిరమైన స్థానం సుస్థిరంగా చూపించాయి. కానీ ఈ ర్యాలీని గమనించేటప్పుడు రిస్క్ మేనేజ్‌మెంట్ కూడా తగినంతగా పాటించాలి. ఆచితూచి అడుగులు వేయాలి.
గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే, దీనిని పెట్టుబడి సలహాగా పరిగణించకూడదు.


Click it and Unblock the Notifications