నష్టాల్లో మార్కెట్లు: ఈ స్టాక్స్ మాత్రం 10% జంప్, ఫార్మా స్టాక్స్ చివరి గంటలో పరుగు
స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత మంచి లాభాల్లోకి వచ్చాయి. కానీ అంతలోనే తిరిగి నష్టాల్లోకి జారుకొని, వరుసగా మూడో రోజు క్షీణతతో ముగిశాయి. నేడు సెన్సెక్స్ 153 పాయింట్లు తగ్గి 52,693 పాయింట్ల వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు క్షీణించి 15,732 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం భారీ లాభాల్లోకి వచ్చినప్పటికీ, తర్వాత క్షీణించాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ సహా దాదాపు ఎక్కువ రంగాలు నష్టాల్లో ముగియగా, రియాల్టీ, పవర్ సూచీలు మాత్రమే లాభాల్లో ముగిశాయి.
దాదాపు అన్ని స్టాక్స్ నష్టపోయినప్పటికీ, కొన్ని స్టాక్స్ మాత్రం అదరగొట్టాయి. పలు స్టాక్స్ 10 శాతానికి పైగా లాభపడ్డాయి. ఎలిగాంట్ మార్బుల్స్ (14.66%), అపార్ ఇండస్ట్రీస్ (14.17%), నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజినీరింగ్ వర్క్స్(12.51%), ఎకోనో ట్రేడ్ (I)(12.33%), KPI గ్లోబల్ ఇన్ఫ్రా(11.35%), జిల్ప్‌మోక్ డిజైన్ (10.81%) లాభపడ్డాయి.

ఇదిలా ఉండగా, స్ట్రైడ్స్ ఫార్మా, అరబిందో ఫార్మా, షెఫ్లెర్ ఇండియా నేడు చివరి గంట లేదా గంటన్నర సమయంలో ఎగిసిపడ్డాయి. బలహీనమైన మార్కెట్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ స్ట్రైడ్స్ ఫార్మా నేడు 4.68 శాతం లాభపడింది. అయితే చివరి గంటలో ఎక్కువగా లాభాల్లోకి వచ్చింది. అరబిందో ఫార్మా నేడు 4 శాతం లాభపడింది. ఇది ఉదయం నుండి భారీ లాభాల్లోనే ఉంది. చివరి అరగంటలో మరింత ఎగిసిపడింది. షెఫ్లర్ ఇండియా నేడు 3.61 శాతం లాభపడింది. చివరి అరగంటలో భారీగా ఎగిసిపడింది.


Click it and Unblock the Notifications