ఈ స్టాక్స్ 5 శాతం అంతకంటే ఎక్కువగా నష్టపోయాయి
స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ప్రారంభమై, ఆద్యంతం అలాగే కొనసాగినప్పటికీ, చివరి అరగంటలో మాత్రం నష్టాల నుండి బయటపడ్డాయి. భారీ నష్టాల్లోనే రోజంతా ఊగిసలాడినప్పటికీ చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాలు, వరుసగా 3 రోజుల నష్టాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించి, సూచీలు నేడు 300 పాయింట్ల నష్టాల్లో ప్రారంభమై, ఓ సమయంలో 400 పాయింట్ల నష్టాల్లోకి కూడా వెళ్లింది. ఆ తర్వాత కాస్త ఊగిసలాట మధ్యనే క్రమంగా పుంజుకుంటూ, చివరకు 16 పాయింట్ల అతి స్వల్ప లాభాల్లో ముగిసింది. ఎట్టకేలకు 53,000 పాయింట్లు క్రాస్ చేసి, 53,177 పాయింట్ల వద్ద ముగిసింది.
నేడు మార్కెట్లు అతి స్వల్ప లాభాల్లో లేదా ఫ్లాట్‌గా ముగిసినప్పటికీ, పలు స్టాక్స్ మాత్రం 5 శాతానికి పైగా నష్టపోయాయి. అందులో మనోమీ టెక్స్ ఇండియా (19.04 శాతం డౌన్), గార్వారే సింథ్ (18.99 శాతం డౌన్), గగన్ గ్యాసెస్ (16.94 శాతం డౌన్), అకి ఇండియా (15.69 శాతం డౌన్), గౌతమ్ ఎగ్జిమ్ (13.04 శాతం డౌన్) 5 శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీ 50 స్టాక్స్‌లో 31 లాభాల్లో, 19 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.

మంగళవారం పలు స్టాక్స్ మాత్రం 15 శాతానికి పైగా లాభపడ్డాయి. కల్లామ్ టెక్స్ టైల్స్(39.88% జంప్), నీల్‌చల్ రిఫ్రాక్ (19.97% శాతం), కాంకర్డ్ డ్రగ్స్ (15.84% జంప్) లాభపడ్డాయి. ఈ స్టాక్స్ పదిహేను శాతం వరకు లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications


