Paisa Double: గత వారం దేశీయ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఒక వైపు బ్యాడ్‌గా ఉన్నప్పటికీ.. మరోవైపు బంగారం, వెండి రేట్లు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని స్టాక్స్ కేవలం నెల రోజుల వ్యవధిలో ఇన్వెస్టర్ల డబ్బును డబుల్ చేసేశాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను స్టాక్స్ ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపించాయి. ఒక నెల కిందట ఎవరైనా ఇన్వెస్టర్ వీటిలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టినట్లయితే.. ప్రస్తుతం వారి పెట్టుబడి విలువ రూ.2 లక్షల కంటే ఎక్కువగా ఉండేది. స్టాక్ మార్కెట్ పతనంలోనూ పైకి ఎదిగిన స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీ గ్యాంగ్ ఇండస్ట్రీస్..
శ్రీ గ్యాంగ్ ఇండస్ట్రీస్ స్టాక్ ఒక నెల కిందట రూ.22.37 వద్ద ట్రేడవుతుండగా.. ప్రస్తుతం దాని రేటు రూ.68.35గా ఉంది. ఈ విధంగా.. స్టాక్ ఒక నెలలోనే పెట్టుబడిదారులకు 170 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ప్రస్తుతం ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయి ఉంది. ఈ స్టాక్ షేర్ ధర నిరంతరం పెరుగుతూనే ఉంది.

ధ్రువ క్యాపిటల్..
ధృవ్ క్యాపిటల్ షేరు విలువ ఒక నెల క్రితం రూ.6.85 రేటుతో ట్రేడవుతుండగా.. దాని రేటు ఇప్పుడు రూ.20.83గా మారింది. ఈ విధంగా ప్రస్తుతం 5 శాతం అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయి ఉంది. ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు 165 శాతానికి పైగా రాబడిని అందించింది.

పంత్ ఇన్ఫినిటీ..
పంత్ ఇన్ఫినిటీ షేర్ ఒక నెల క్రితం రూ.27.80 రేటుతో ట్రేడవుతుండగా, దాని రేటు ఇప్పుడు రూ.50.95కి పెరిగింది. ఈ స్టాక్ 1 నెలలో పెట్టుబడిదారులకు 150 శాతం రాబడిని ఇచ్చింది. ఈ రోజు స్టాక్ 5 శాతం మేర నష్టపోయి లోయర్ సర్య్కూట్ లో లాక్ అయింది.

VCU డేటా మేనేజ్‌మెంట్..
VCU డేటా మేనేజ్‌మెంట్ స్టాక్ ఒక నెల క్రితం రూ.19.65 వద్ద ట్రేడవుతుండగా.. దాని రేటు ఇప్పుడు రూ. 59.15కి పెరిగింది. ఈ కాలంలో స్టాక్ తన ఇన్వెస్టర్లకు 160 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ప్రస్తుతం స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిఉంది. మరింతగా షేర్ విలువ పెరిగే అవకాశం ఉంది.

హరియా అప్పెరల్స్..
హరియా అప్పెరల్స్ షేరు ఒక నెల క్రితం రూ.1.71 రేటుతో ట్రేడవుతుండగా.. ఇప్పుడు దాని రేటు రూ. 4.78కి పెరిగింది. ఈ స్టాక్ 1 నెలలో పెట్టుబడిదారులకు దాదాపు 145% రాబడిని ఇచ్చింది. ప్రస్తుతం స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిఉంది.

వెంచురా టెక్స్‌టైల్స్..
వెంచురా టెక్స్‌టైల్స్ స్టాక్ ఒక నెల క్రితం రూ.3.76 వద్ద ట్రేడవుతుండగా.. దాని రేటు ఇప్పుడు రూ.7.15కి పెరిగింది. ఈ స్టాక్ 1 నెలలో పెట్టుబడిదారులకు దాదాపు 100 శాతం రాబడిని ఇచ్చింది.

స్టృఢీ ఇండస్ట్రీస్..
స్టృఢీ ఇండస్ట్రీస్ స్టాక్ నెల క్రితం రూ.0.38 రేటుతో ట్రేడ్ అవుతుండగా.. ఇప్పుడు దాని రేటు రూ. 0.89కి చేరుకుంది. ఈ స్టాక్ 1 నెలలో పెట్టుబడిదారులకు దాదాపు 105 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది.

గెలాక్టికో కార్పొరేట్..
గెలాక్టికో కార్పొరేట్ షేరు ఒక నెల క్రితం రూ.29.85 వద్ద ట్రేడవుతుండగా.. దాని రేటు ఇప్పుడు రూ. 65.05కి పెరిగింది. ఈ స్టాక్ 1 నెలలో పెట్టుబడిదారులకు దాదాపు 105 శాతం రాబడిని ఇచ్చింది. ఇలా పైన తెలిపిన స్టాక్స్ ఇన్వెస్టర్ల సంపదను కేవలం నెల రోజుల్లోనే డబుల్ చేశాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications