ఈ స్టాక్స్ షార్ట్ టర్మ్‌లో 15 శాతం రిటర్న్స్ ఇవ్వవచ్చు
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడు రోజులు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ నేడు 567 పాయింట్లు నష్టపోయి 55,107 పాయింట్ల వద్ద, నిఫ్టీ 153 పాయింట్లు తగ్గి 16,416 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు సూచీలకు ఏ దశలోను కొనుగోళ్ళ మద్దతు లభించలేదు. ఉదయం నుండి నష్టాల్లోనే ఉన్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను రెండు శాతం మేర పెంచింది. ఇది ద్రవ్యోల్భణ ఆందోళనను పెంచింది. ఆర్బీఐ కూడా కీలక వడ్డీ రేటును పెంచవచ్చునని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 118 డాలర్ల స్థాయికి వచ్చాయి.
సూచీలు భారీగా నష్టపోయి, వివిధ రంగాలు క్షీణించాయి. అయితే కొన్ని స్టాక్స్ మాత్రం డబుల్ డిజిట్ రిటర్న్స్ ఇవ్వవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏబీబీ ఇండియా, ఆర్సీఎఫ్, కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ పద్దెనిమిది శాతం మేర రిటర్న్స్ ఇవ్వవచ్చునని అంటున్నారు.

ABB ఇండియా షేర్ ధర నేడు రూ.2347 వద్ద ముగిసింది. అయితే ఈ స్టాక్‌ను రూ.2244 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.2528 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చునని, సానుకూలంగా ఉంటే రూ.2750కి చేరుకోవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంటే 15 శాతం వరకు రిటర్న్స్ ఇస్తాయి.
అలాగే కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్ రూ.245 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని రూ.275 నుండి రూ.295 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చునని అంటున్నారు. ఆర్సీఎఫ్ స్టాక్‌ను రూ.92 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.105 నుండి రూ.115 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications