ఈ నెల ఏప్రిల్ 9న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. అయితే రేపో రేటు తగ్గించినప్పటి నుండి చాల బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDలు) వడ్డీ రేట్లపై కోత విధించాయి. మొదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ సహా ఇలా అన్ని బ్యాంకులు FDలపై వడ్డీని తగ్గించాయి. అయితే కొన్ని బ్యాంకులు ఇప్పటికీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు FDలు ఒక బెస్ట్ డీల్'గా మిగిలిపోయింది.

చిన్న బ్యాంకుల నుండి పెద్ద ఆఫర్: వడ్డీ రేట్ల తగ్గింపు మధ్య కొన్ని స్మాల్ ఫైనాన్స్ ఇంకా ప్రాంతీయ బ్యాంకులు ఇప్పటికీ FDలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే ఈ బ్యాంకులు లాంగ్ టర్మ్ డిపాజిట్లను ఆకర్షించాలని చూస్తున్నాయి. అందుకే తక్కువ వడ్డీ రేటు సమయంలో కూడా ఆవరేజ్ కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు 9 శాతం కంటే ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి.
మీరు సీనియర్ సిటిజన్ అయితే ఇంకా మీ వడ్డీ రాబడి పెంచుకోవాలనుకుంటే ప్రస్తుతం బెస్ట్ FD రేట్లను అందిస్తున్న కొన్ని బ్యాంకులు లిస్ట్ ఇక్కడ ఉంది:
*AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 18 నెలల కాలానికి 8.25% వడ్డీని అందిస్తున్నాయి.
*ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 888 రోజుల 8.55% వడ్డీని ఇస్తుండగా,
*ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 444 రోజుల కాలానికి 8.25% వడ్డీని పొందుతుంది.
*జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 నుండి 3 సంవత్సరాల కాలానికి 8.75% వడ్డీని ఇస్తుంది.
*నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 18 నుండి 36 నెలల కాలానికి 9% వడ్డీని అందిస్తున్నాయి.
*సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5 సంవత్సరాల కాలానికి 9.1% వడ్డీని అందిస్తుంది.
*ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 18 నెలల కాలానికి 8.75% వడ్డీని ఇస్తున్నాయి.
*యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1001 రోజుల కాలానికి 9.1% వడ్డీని అందిస్తున్నాయి.
*ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 నుండి 3 సంవత్సరాల కాలానికి 9.1% వడ్డీని ఇస్తుంది.
వడ్డీ రేట్లు ఎందుకు తగ్గాయి: బ్యాంకులు సాధారణంగా ఎక్కువ వడ్డీ రేట్లు ఇవ్వడం ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్లను ఆకర్షణీయంగా చేస్తాయి, అందుకే ప్రజలు బ్యాంకుల్లో ఎక్కువ డబ్బును ఉంచుకుంటారు అలాగే బ్యాంకులు కూడా ఆర్థిక కార్యకలాపాలను సజావుగా నిర్వహించుకోగలవు. ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులు తక్కువ వడ్డీకే ఆర్బీఐ నుండి నిధులు తీసుకోవచ్చు. కాబట్టి ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులు కూడా ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications