ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 65% రిటర్న్స్ ఇచ్చాయి, కారణం 'కరోనా'!

ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరువలో ఉన్నాయి. సెన్సెక్స్ 53,000 పాయింట్ల వద్ద, నిఫ్టీ 16,000పాయింట్లకు సమీపంలో ఉంది. ఇలాంటి సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ధైర్యం అవసరం. పెట్టుబడులకు సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) ఉత్తమ మార్గంగా చెప్పవచ్చు. మార్కెట్ కరోనా థర్డ్ వేవ్ ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని ఇటీవలి నివేదికలో మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. మార్కెట్ అస్థిరంగా ఉన్న పరిస్థితుల్లో సిప్‌లు పెట్టుబడికి ఉత్తమ మార్గమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

UTI ఫ్లెక్సీ క్యాప్ ఫండ్

UTI ఫ్లెక్సీ క్యాప్ ఫండ్

UTI ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌కు వ్యాల్యూ రీసెర్చ్, క్రిసిల్ ఫైవ్ స్టార్ రేటింగ్‌ను ఇచ్చాయి. ఏడాది కాలంలో ఇది 61 శాతం రిటర్న్స్‌ను అందించింది. ఐతే ఇక్కడ ఓ విషయం గమనించాలి. గత ఏడాది కరోనా కారణంగా మార్చి నెలలో మార్కెట్లు కుప్పకూలాయి. ఆ తర్వాత సూచీలు సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. భారీ పతనం నుండి మార్కెట్లు పైకి లేచినందున ఈ ఫండ్ పైన వచ్చిన రిటర్న్స్‌ను ఎక్కువగా వచ్చిన రాబడిగా పరిగణించకూడదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అజయ్ త్యాగి నేతృత్వంలో UTI ఫ్లెక్సి క్యాప్ ఫండ్‌ను నిర్వహిస్తున్నారు. దాదాపు రూ.18,000 కోట్ల AUMను కలిగి ఉంది. ఈ ఫండ్స్‌లో సిప్స్ అంత ఖరీదైనవి కావు. ప్రతి నెల రూ.1000తో సిప్ ప్రారంభించవచ్చు.

మిరా అసెట్స్ లార్జ్‌క్యాప్ ఫండ్

మిరా అసెట్స్ లార్జ్‌క్యాప్ ఫండ్

ఏ ఫండ్ గురించి అయినా చెప్పేముందు రీడర్స్ ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మార్కెట్లు గత ఏడాది భారీ పతనం నుండి రెండింతలు పెరిగాయి. కాబట్టి ఏ ఫండ్ అయినా ఈ కాలంలో మంచి రాబడిని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిని గుర్తుంచుకోవాలి. జీడీపీ రేషియోతో మార్కెట్ క్యాప్ 105ను తాకింది. ఈ సగటు 79గ ఉంది. ఇక, మిరా అసెట్స్ లార్జ్‌క్యాప్ ఫండ్ తన నిధులను ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింది. వ్యాల్యీ రీసెర్చ్, మార్నింగ్ స్టార్, క్రిసిల్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఏడాది రిటర్న్స్ 51 శాతంగా నమోదయ్యాయి. అయిదేళ్ల రిటర్న్స్ 16 శాతంగా ఉన్నాయి. ఇన్ఫోసిస్, HDFC బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు తదితర వాటిల్లో ఇన్వెస్ట్ చేసింది.

యాక్సిస్ బ్లూచిప్ ఫండ్

యాక్సిస్ బ్లూచిప్ ఫండ్

ఈ ఫండ్ పట్ల చాలామంది విశ్లేషకులు సానుకూలతను కనబరుస్తారు. క్రిసిల్, వ్యాల్యూ రీసెర్చ్, మార్నింగ్ స్టార్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. అయితే ఏడాది కాలంలో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ 44 శాతం రిటర్న్స్‌ను మాత్రమే ఇచ్చింది. అయిదేళ్లలో 16 శాతం రిటర్న్స్ ఇచ్చింది. రూ.28,000 కోట్ల AUMను కలిగి ఉంది. టాప్ 10 స్టాక్స్‌లోనే 65 శాతం మొత్తం ఇన్వెస్ట్ చేసింది. ఇన్ఫోసిస్, HDFC బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ICICI బ్యాంకు, టీసీఎస్‌లలో ఇన్వెస్ట్ చేసింది. రూ.500తో సిప్ ప్రారంభించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి స్టాక్ మార్కెట్‌తో ముడివడి ఉన్న అంశం. కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి. పైన పేర్కొన్న అంశాలు ఆయా ఫండ్స్ ఆయా కాలాల్లో ఇచ్చిన రిటర్న్స్ మాత్రమే. కాబట్టి మున్ముందు చెప్పలేం. కాబట్టి ఆయా ఫండ్‌ను పరిశీలించి, నిపుణుల సూచనలతో మాత్రమే పెట్టుబడులు పెట్టడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+