ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు చేసే తప్పులు ఇవే.. మిస్ అయితే మీకే నష్టం.
ఐటీఆర్ ఫైలింగ్ గురించి చాల మందికి తెలిసే ఉంటుంది. అయితే త్వరలోనే ఉద్యోగులకు ఫారం-16 నింపాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫెయిల్ చేసేటప్పుడు తప్పులు లేకుండా చూసుకోవడం ముఖ్యం. ఇంకా చివరి తేదీకి ముందే ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా జరిమానాలు, పన్ను నోటీసులు లేకుండా చూసుకోవచ్చు. 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి మీరు పే స్లిప్, వడ్డీ సర్టిఫికేట్, పెట్టుబడి సంబంధిత పేపర్స్ వంటి డాకుమెంట్స్ రెడీ చేసుకోవాలి. ఐటీఆర్ ఫైల్ చేయడం అంటే కేవలం ఫామ్ నింపడం కాదు, కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులకి కూడా పెనాల్టీ కట్టాల్సి రావొచ్చు. ఇలా తప్పులు లేకుండా ఉండాలంటే కొని విషయాలు గుర్తుంచుకోవాలి.

చాలా మందికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. మీరు ఈ డేట్ మిస్ అయితే రూ. 5 వేల వరకు జరిమానా కట్టాల్సి రావచ్చు. ఇంకా ఆలస్యం చేయడం వల్ల కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కోల్పోవచ్చు. ఈ సమస్యలన్నీ నివారించడానికి మీ ఐటీఆర్ టైంకి ముందే ఫైల్ చేయాలి.
సరైన ITR ఫామ్ సెలెక్ట్ చేసుకోవపోతే మీ ఐటీఆర్ క్యాన్సల్ కావచ్చు లేదా ప్రాసెసింగ్ ఆలస్యం కావచ్చు. ఉదాహరణకు మీకు జీతం వస్తుందా, రూ. 50 లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్నారా, షేర్స్ పై ఇన్వెస్ట్ చేస్తుంటారా అయితే ITR-1 ఫామ్ తీసుకోవాలి. ఈసారి, స్టాక్ మార్కెట్ నుండి ఉద్యోగులతో పాటు డబ్బు సంపాదించే వారు కూడా ITR-1 ఫామ్ నింపాల్సి ఉంటుంది.
మీకు ఎ రకమైన ఆదాయం ఉన్న అంటే చిన్న మొత్తమైన లేదా పెద్ద మొత్తమైన ఐటీఆర్ ఫామ్‌లో ప్రకటించాలి. ఇందులో సేవింగ్స్ అకౌంట్,FD డిపాజిట్లపై వడ్డీ, అద్దె ఆదాయం, డివిడెండ్‌లు, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్ల లాభాలు తెలియజేయాలి. మీ ఆదాయం గురించి దాచడం లేదా మర్చిపోవడం చేస్తే పన్ను శాఖ మీకు నోటీసు జారీ చేయవచ్చు ఇంకా మీకు పెనాల్టీ విధించవచ్చు.
ఐటీఆర్ ఫెయిల్ చేసే ముందు ఫారం 26AS, అన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS) చెక్ చేయండి. ఈ ఫామ్ మీ సంస్థ లేదా బ్యాంక్ తగ్గించిన పన్నులు ఇంకా ఏడాదిలో ఆర్థిక లావాదేవీల గురించి సమాచారాన్ని అందిస్తుంది. దీనికి ఇంకా మీ ఐటీఆర్ మధ్య ఏదైనా తేడా ఉంటే ముందుగా చెక్ చేసుకోండి. ఈ చిన్న తప్పులు లేకుండా ఐటీఆర్ ప్రాసెసింగ్‌లో లోపాలు, జాప్యాలను తగ్గిస్తాయి.
మీరు జస్ట్ ఐటీఆర్ ఫైల్ చేస్తే సరిపోదు, ఇందుకు దానిని వెరిఫై కూడా చేయాలి. వెరిఫై జరగకపోతే మీ ఐటీఆర్ తప్పు అని పరిగణిస్తారు. ఆధార్ OTP లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ వెరిఫికేషన్ ఈజీ మార్గం. దీనికి కొన్ని నిమిషాలు సరిపోతుంది. మీకు ఇవన్నీ అర్థం కాకపోతే నిపుణుల సహాయం తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications