Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లకు మంచి ఛాన్స్. గత కొద్దీ రోజులుగా పడిపోతూ పెరుగుతున్న సెన్సెక్స్ నిఫ్టీ ప్రస్తుతం లాభాల్లో ట్రేడవుతుంది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఐపిఒ మార్కెట్ చాలా కూల్'గా ఉంది. కానీ కొన్ని వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాల కారణంగా భారత స్టాక్ మార్కెట్ తీవ్రంగా పడిపోయింది. అంతేకాదు గత కొన్ని నెలలుగా మార్కెట్లో డౌన్ ట్రెండ్ కొనసాగింది. ఇలాంటి పరిస్థితిలో కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) తీసుకురావడానికి దూరంగా ఉన్నాయి. కానీ ఈ వారం IPO మార్కెట్లో కొంత జోష్ ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే 4 కొత్త IPOలు రాబోతున్నాయి.

పరదీప్ పరివాహన్ IPO: పారాదీప్ ట్రాన్స్‌పోర్ట్ IPO నిన్న మార్చ్ 17న సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవగా, మార్చి 19న ముగుస్తుంది. ఈ IPO సైజ్ రూ. 44.86 కోట్లు. దీని కింద కంపెనీ 45.78 లక్షల కొత్త షేర్లను జారీ చేస్తుంది. ఒక్కో షేరు ధర రూ.93 నుండి రూ.98గా నిర్ణయించారు. షేర్ ఇండియా క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పారాదీప్ ట్రాన్స్‌పోర్ట్ IPOకి బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరించనుంది. ఈ ఇష్యూకి బిగ్‌షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా ఉంది. దీని లిస్టింగ్ BSE SMEలో ఉంటుంది.
డివైన్ హీరా జ్యువెలర్స్ IPO: డివైన్ హీరా జ్యువెలర్స్ IPO కూడా నిన్న (మార్చి 17) సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభం అవగా, మార్చి 19న ముగుస్తుంది. ఈ SME IPO సైజ్ రూ. 31.84 కోట్లు అలాగే దీని కింద కంపెనీ 35.38 లక్షల షేర్లను జారీ చేస్తుంది. ఈ IPO ఒక్కో షేరు ధర రూ.90గా నిర్ణయించారు. డివైన్ హీరా జ్యువెలర్స్ IPOకి బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా హారిజన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నియామకం చేసింది. మార్చి 20న షేర్స్ కేటాయింపు ఖరారు అవుతుంది. మార్చి 24న NSE SMEలో దీని లిస్టింగ్ ఉండొచ్చు.
గ్రాండ్ కాంటినెంట్ హోటల్స్ IPO: గ్రాండ్ కాంటినెంట్ హోటల్స్ IPO మార్చి 20న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమై మార్చి 24న ముగుస్తుంది. ఈ SME IPO సైజ్ రూ. 74.46 కోట్లు. ఈ IPO కింద కొత్త షేర్లు జారీ చేస్తుంది అలాగే ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు షేర్లలో కొంత భాగాన్ని ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయిస్తారు. దీని ఒక్కో షేరు ధర రూ.107 నుండి రూ.113గా నిర్ణయించారు. దీని లాట్ సైజు 1200 షేర్లు అలాగే పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్ కోసం బుక్ చేసుకోవాలి.
అరిసిన్ఫ్రా సొల్యూషన్స్ IPO: అరిసిన్‌ఫ్రా సొల్యూషన్స్ IPO మార్చి 20న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమవుతుంది. దీని కోసం మార్చి 25 వరకు బిడ్డింగ్ చేయవచ్చు. ఈ IPO కింద 2.86 కోట్ల షేర్లు జారీ చేయనుంది. దీని షేర్స్ ధరల రేంజ్ ఇంకా ప్రకటించలేదు. కానీ షేర్స్ కేటాయింపు మార్చి 26న జరగవచ్చు. మార్చి 28న కంపెనీ బిఎస్‌ఇ అండ్ ఎన్‌ఎస్‌ఇలో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది.
More From GoodReturns

ఆర్బీఐ నిర్ణయం.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాకా?

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications