Best Pharma Mutual funds: టాప్ ఫార్మా మ్యూచువల్ ఫండ్స్ ఇవే..
చాలా మంది స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టాలనుకుంటారు. మార్కెట్ పెట్టుబడి పెట్టాలంటే కచ్చితమైన అవగాహన ఉండాలి. అలా కాని పక్షంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ఉత్తమైన మార్గం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు ఫార్మాలోనే పెట్టుబడి పెట్టాలనుకుంటారు. అలాంటి వారికి ఫార్మా సెక్టోరియల్ ఫండ్స్ ఉన్నాయి. అయితే గత సంవత్సరం 2022లో ఫార్మా, హెల్త్‌కేర్ పడిపోయాయి. దీంతో చాలా ఫార్మా కంపెనీలు అండర్ వాల్యూవేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి.
మార్చి 2023 చివరి నుంచి ఫార్మా స్టాక్ ల్లో ర్యాలీ ప్రారంభమైంది. అయితే ఎలాంటి ఫార్మా స్టాక్ ఎంపిక చేసుకోవాలో తెలియనప్పుడు ఫార్మా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. అనేక మ్యూచువల్ ఫండ్స్ అభివృద్ధి చెందుతున్న ఫార్మా, ఆరోగ్య సంరక్షణ రంగానికి లబ్ధిదారులుగా ఉన్నాయి. 3-సంవత్సరాలు, 5-సంవత్సరాల రాబడిపై పనితీరు కొన్ని ఫండ్స్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. వాటిలో SBI హెల్త్‌కేర్ Opp ఫండ్, DSP హెల్త్‌కేర్ ఫండ్, నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్, టాటా ఇండియా ఫార్మా & హెల్త్‌కేర్ ఫండ్, మిరే అసెట్ హెల్త్‌కేర్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్ ఫార్మా హెల్త్‌కేర్ & డయాగ్నోస్టిక్స్ (P.H.D) ఫండ్స్ ఉన్నాయి.

ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం, FY23లో భారతదేశ ఆరోగ్య వ్యయం GDPలో 2.1%, FY22లో 2.2%, FY21లో 1.6%గా ఉంది. కేంద్ర బడ్జెట్ 2023లో, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు రూ. 89,155 కోట్లు (USD 10.76 బిలియన్లు) కేటాయించారు. ఇది 2021-22లో రూ. 86,201 కోట్లతో (USD10.4 బిలియన్) 3.43% పెరిగింది. అంతేకాకుండా, ఆరోగ్యం, వైద్య విద్య కోసం మానవ వనరులు రూ. 6,500 కోట్లు (USD 780 మిలియన్లు) కేటాయించారు. సో భవిష్యత్ ఫార్మా రంగం పెరిగే అవకాశం ఉంది. ఈ రంగంలో ఉండ కంపేనీలు మంచిగా ఫర్ఫామ్ చేసే అవకాశం ఉంది.
ఫార్మా, హెల్త్‌కేర్ ఫండ్‌ల యొక్క పోర్ట్‌ఫోలియో విశ్లేషణలో ఎక్కువ మంది ఐదు రకాల వ్యాపారాలలో విస్తృతంగా పెట్టుబడి పెడుతున్నారని వెల్లడిస్తున్నారు. అందులో ఫార్మాస్యూటికల్ కంపెనీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఆసుపత్రులు, బీమా కంపెనీలు, స్పెషాలిటీ కెమికల్ ప్రొడ్యూసర్లు, API తయారీదారు కంపెనీలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications