Stocks to BUY: ఫార్మాస్యూటికల్ నుంచి ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ వరకు కొన్ని స్టాక్స్ రానున్న కొద్ది రోజుల్లో మంచి రాబడులను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దేశంలోని సెంట్రమ్ బ్రోకింగ్ సంస్థ ఈ 5 లార్జ్ క్యాప్ కంపెనీ షేర్లు గరిష్ఠంగా 44 శాతం వరకు పెరగే అవకాశం ఉందని వెల్లడించింది. నిఫ్టీ ఇండెక్స్ బుల్లిష్ సెంటిమెంట్‌ను వీక్లీ చార్ట్‌లో సూచిస్తున్నట్లు సదరు సంస్థ వెల్లడించింది.

HCL టెక్..
HCL టెక్ దేశంలో ప్రముఖ గ్లోబల్ IT సేవల సంస్థ. ఆదాయాల పరంగా టాప్-5 ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం దీని షేర్ మరింత పెరుగుతుందనే నేపథ్యంలో బ్రోకరేజ్ BUY రేటింగ్ ఇచ్చింది. షేర్ టార్కెట్ రేటు రూ.1350గా ప్రకటించింది. అంటే ప్రస్తుత ధర కంటే ఇది దాదాపు 44 శాతం అధికం. హెచ్‌సీఎల్ టెక్ క్యూ1లో మంచి ఫలితాలను నమోదు చేసింది. భవిష్యత్ త్రైమాసికాల్లో కూడా వృద్ధి జోరు కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. చాలా మంచి డివిడెండ్ దిగుబడితో వ్యాల్యుయేషన్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

HDFC..
HDFC అనేది 9 మిలియన్ల గృహ యూనిట్లకు ఫైనాన్సింగ్‌తో దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా ఉంది. ఇది 1977లో స్థాపించబడింది. కంపెనీ ప్రస్తుతం రూ.6.2 ట్రిలియన్లకు పైగా లోన్ బుక్ కలిగి ఉంది. రానున్న కాలంలో స్టాక్ దాదాపు 23 శాతం పెరిగి రూ.2,800-3,000 మధ్య ట్రేడ్ అవుతుందని బ్రోకరేజ్ అంచనా వేసింది. దశాబ్దంలో అత్యల్ప వడ్డీ రేట్లతో, భారతదేశం అంతటా గృహాలకు విపరీతమైన డిమాండ్ ఉండటం కలిసొచ్చే అంశంగా ఉంది. పైగా తక్కువ NPAలను కలిగి ఉంది.

డాబర్..
డాబర్ ఇండియా లిమిటెడ్ దేశంలో నాల్గవ అతిపెద్ద FMCG కంపెనీ. దీని ఆదాయం రూ. 9,500 కోట్లు. రూ.1,00,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంది. డాబర్ ఉత్పత్తులు విదేశీ మార్కెట్లలో కూడా భారీ మార్కెట్ కలిగి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే స్టాక్ ప్రస్తుతం ఉన్న స్థాయిల నుంచి 20 శాతం పెరిగి రానున్న కాలంలో రూ.650-700 మధ్యకు చేరుకుంటుందని బ్రోకరేజ్ తెలిపింది. గ్రామీణ మార్కెట్, బ్రాండ్‌లపై దృష్టి పెట్టడం దీర్ఘకాలంలో అద్భుతమైన వృద్ధికి దారితీయవచ్చు.

స్టేట్ బ్యాంక్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్చ్యూన్ 500 కంపెనీ. దాదాపు 200 ఏళ్లకు పైగా గొప్ప వారసత్వంతో ముంబైలో ప్రధాన కార్యాలయం ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంటిటీ. SBI డిపాజిట్లలో 25% మార్కెట్ వాటాతో అతిపెద్ద ఇండియన్ బ్యాంక్, 44 కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ప్రైవేట్ రంగ సంస్థలతో పోలిస్తే ఎస్‌బిఐ తక్కువ వాల్యుయేషన్‌తో ట్రేడవుతోంది. అయితే రానున్న రోజుల్లో స్టాక్ ప్రస్తుత విలువ నుంచి 13 శాతం పెరిగి రూ.600 స్థాయికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ అంచనా వేసింది. స్టాక్ కు కొనుగోలు రేటింగ్ ను అందించింది.

సన్ ఫార్మాస్యూటికల్..
సన్ ఫార్మా 4.5 బిలియన్ డాలరల ఆదాయాలతో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద స్పెషాలిటీ జెనరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీగా ఉంది. 40 కంటే ఎక్కువ ప్లాంట్లతో.. ఇది 100 దేశాల్లో ఆరోగ్య సంరక్షణ నిపుణులచే విశ్వసించబడే అధిక-నాణ్యత, సరసమైన మందులను అందిస్తోంది. దీనిపై బులిష్ గా ఉన్న బ్రోకరేజ్ రానున్న కాలంలో దాదాపు రూ.1,000కు లేదా 12 శాతం మేర స్టాక్ విలువ చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగం మెరుగైన పనితీరుకు సన్ ఫార్మా దీర్ఘకాలిక లబ్ధిదారుగా ఉండటం ఇన్వెస్టర్లకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి. ఖర్చు తగ్గింపు చర్యల వల్ల అప్పులు తగ్గి, మార్జిన్లు వెనక్కి వస్తున్నాయి. దేశీయ వ్యాపారంలో సన్ మెరుగైన అమ్మకాలను చూపుతోంది
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications