బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేవలం నిన్న ఒక్కరోజే 3 వేలు పెరిగి తులం ధర లక్ష దాటింది. ఇలాంటి సమయంలో ఏ దేశం వద్ద అత్యధిక బంగారు నిల్వలున్నాయాని వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇందులో భారత్ స్థానం ఎక్కడ అనే ఆలోచన మొదలైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు సరికొత్త శిఖరాలను తాకుతుంది. ఈ ఏడాది 2025 ప్రారంభం నుండి చూస్తే పసిడి ధర సుమారు 23% పెరిగింది. గత ఏడాదితో పోల్చితే 50% వృద్ధి నమోదు చేసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్న సోమవారం ఒక్కరోజే బంగారం ధర $3,400 డాలర్లను దాటింది. డాలర్ బలహీనపడటం, అమెరికా ఆర్థిక విధానాలపై నెలకొన్న అంచనాలే దీనికి ప్రధాన కారణం. ఇక మనదేశంలోనూ బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. అలాగే తొలిసారిగా 10 గ్రాముల ధర రూ.1 లక్ష మార్కును దాటి కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేసింది.
గత ఏడాది చివరి త్రైమాసికంలో ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేశాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, ఈ కొనుగోళ్లు 333 టన్నులకు చేరాయి. దీంతో వరుసగా మూడో ఏడాది వార్షిక కొనుగోళ్లు 1,000 టన్నులను అధిగమించాయి. అంతర్జాతీయ వాణిజ్యం ఇంకా ఆర్థిక స్థిరత్వానికి బంగారు నిల్వలు ఎంతో కీలకం. ఇవి దేశాల విశ్వసనీయతను పెంచడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి స్థానాన్ని నిర్ణయిస్తాయి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాల లిస్టులో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికా దేశం వద్ద 8,133.46 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీని విలువ సుమారు 682 బిలియన్ డాలర్లు. తర్వాతి స్థానాల్లో ఉన్న జర్మనీ, ఇటలీ ఇంకా ఫ్రాన్స్ దేశాల మొత్తం నిల్వలు కూడా అమెరికా నిల్వల కంటే తక్కువే.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2024లో అత్యధికంగా 89.54 టన్నుల బంగారం కొనుగోలు చేసిన పోలాండ్ ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానానికి చేరుకుంది. ఇక భారతీయ సంస్కృతిలో బంగారంకి ఒక ప్రత్యేక స్థానం, ప్రాముఖ్యత ఉంది. ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుతున్న ధోరణికి అనుగుణంగా, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా బంగారు నిల్వలకు అదనంగా 72.60 టన్నులను కొనుగోలు చేసింది. దీంతో 2024లో పోలాండ్ తర్వాత అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది. ప్రస్తుతం భారతదేశం వద్ద మొత్తం 876.18 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం, అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాల్లో భారతదేశం ఏడవ స్థానంలో నిలిచింది. చైనా కూడా బంగారు నిల్వలను పెంచుకుని రష్యాను అధిగమించి ఐదో స్థానంలో ఉంది. బంగారం ధరలు పెరుగుతున్న ఈ సమయంలో, ప్రపంచ దేశాల బంగారు నిల్వలపై దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది.
2024-25లో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న టాప్ 10 దేశాలు చూస్తే అమెరికా 8,133.46 టన్నులు, జర్మనీ 3,351.53 టన్నులు, ఇటలీ 2,451.84 టన్నులు, ఫ్రాన్స్ 2,437.00 టన్నులు, చైనా 2,279.56 టన్నులు, స్విట్జర్లాండ్ 1,039.94 టన్నులు, భారతదేశం 876.18 టన్నులు, జపాన్ 845.97 టన్నులు, నెదర్లాండ్స్ 612.45 టన్నులు, పోలాండ్ 448.23 టన్నులు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications