Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే ఈ పని చేయండి..!
ఒకప్పుడు చేతిలో డబ్బు ఉంటే భూమి కొనేవారు. లేకుంటే బంగారం కొనేవారు. ఆ తర్వాత ఎదైనా బీమా (ఎల్ఐసీ ట్రేడిషనల్ పాలసీ) తీసుకునేవారు. ఎఫ్డీలు చేసేవారు. కానీ ఇప్పుడు భూమి ధరలు భారీగా పెరిగిపోయాయి. బంగారం ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ఎఫ్డీ వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. ట్రేడిషనల్ బీమా తీసుకుంటే ప్రయోజనం తక్కువే. అందుకే చాలా మంది ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లుతున్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు పెరిగిపోతున్నారు. అయితే చాలా మందికి మ్యూచువల్ ఫండ్లపై అవగాహన లేదు. మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలం మంచి రాబడి ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.
రాబడి అనేది ఎంచుకునే ఫండ్ ను బట్టి ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో ప్రధానంగా మూడు రకాల ఫండ్స్ ఉంటాయి. ఇందులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు, డెట్ మ్యూచువల్ ఫండ్లు, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. ఇందులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలంలో మంచి రాబడి ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈక్విటీలో కూడా చాలా ఫండ్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు, ఇండెక్స్ ఫండ్లు, మల్టీక్యాప్ ఫండ్లు, ఫోకస్డ్ ఫండ్లు, ఫ్లెక్సి క్యాప్ ఫండ్లు, సెక్టోరియల్ మ్యుచువల్ ఫండ్లు ఉంటాయి.

స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ రివార్డ్ కూడా అదే విధంగా ఉంటుంది. లాంగ్ టర్మ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు మంచి రాబడి ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రిస్క్ తక్కువ ఉండాలనుకునే వారు లార్జ్ క్యాప్, ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. రిస్క్ చాలా తక్కువగా ఉండాలనుకుంటే డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టబడి పెట్టొచ్చు. ఇందులో కూడా రకాలు ఉంటాయి. ఓవర్ నైట్ ఫండ్ల, షార్ట్ డ్యూరేషన్ ఫండ్లు, లో డ్యూరేషన్ ఫండ్లతో పాటు చాలా రకాల ఫండ్లు ఉంటాయి. అలాగే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లలో కూడా రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది. 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత డబ్బు అవసరం ఉండి.. ఈక్విటీ రిస్క్ పూర్తిగా భరించలేక, అలాగని తక్కువ రిటర్న్స్ కాకుండా మధ్యస్థంగా కోరుకునే వారికి ఇవి సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
మ్యూచువల్ ఫండ్లలో సిప్ రూపంలో పెట్టుబడి పెట్టడం మంచిది. మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి. ఒకే మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు మార్కెట్ పడిపోయినప్పుడు పెట్టుబడి పెట్టడం మంచిది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications