ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు పెరుగుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిల్లో స్మాల్, మిడ్ క్యాప్ కంటే బ్లూచిప్, ఇండెక్స్ ఫండ్ల మంచివని నిపుణులు చెబుతున్నారు. అయితే లాంగ్ టర్మ్ లో పెట్టుబడి పెట్టేవారు, రిస్క్ తీసుకునే వారు స్మాల్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చని సూచిస్తున్నారు. అయిత గత 3 సంవత్సరాలుగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన స్మాల్ క్యాప్ ఫండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్
CRISIL, వాల్యూ రీసెర్చ్ రెండు రేటింగ్ ఏజెన్సీలు క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ ఫండ్ 3 సంవత్సరాలలో 50.3% వార్షిక రాబడిని, అదే కాలంలో 99.41% సంపూర్ణ రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ ఐటీసీ, ఆర్‌బిఎల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జిందాల్ స్టెయిన్‌లెస్, ఐఆర్‌బి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ కంపెనీల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టింది.

రూ. 10,000
మీరు ఈ ఫండ్ లో నెలవారీగా రూ. 10,000ను SIPగా ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని మొత్తంగా రూ. 3,60,000 కడతారు. అంటే 51.1% వార్షిక రాబడితో 3 సంవత్సరాలలో రూ. 7,58.022గా మారి ఉండేది. మీరు ఫండ్ లో SIP పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ. 1,000తో ఈ ఫండ్‌లో ప్రారంభించాల్సి ఉంటుంది.

నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్
ఇది 3 సంవత్సరాలలో 2వ అత్యధిక SIP రిటర్న్స్‌తో జాబితాలో ఉన్న మరొక స్మాల్ క్యాప్ ఫండ్. ఫండ్ 3 సంవత్సరాల SIPలో 35% వార్షిక రాబడిని అందించింది. ఈ ఫండ్ లో రూ. 10,000 నెలవారీ SIP చేస్తే 3 సంవత్సరాలలో రూ. 6,29,394 అయి ఉండేది. ఈ ఫండ్ ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కెపిఐటి టెక్నాలజీస్ మరియు బజాజ్ ఎలక్ట్రానిక్స్‌తో సహా టాప్ హోల్డింగ్‌తో ఈక్విటీలో 96.5% పెట్టుబడులను కలిగి ఉంది.

కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్
కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్ 3 సంవత్సరాల SIPలో అత్యధిక రాబడితో ఈ జాబితాలో 3వ స్థానంలో ఉంది. 3 సంవత్సరాల SIPలో, ఫండ్ 32.94% వార్షిక రాబడిని ఇచ్చింది. అదే సమయంలో ఇది 59.92% సంపూర్ణ రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్‌లోనెలవారీ రూ. 10,000 SIPతో 3 సంవత్సరాలలో పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ. 6,24,011గా మారి ఉండేది.


Click it and Unblock the Notifications