Mutual Funds: రూ. లక్షను ఐదేళ్లలో రూ.2.50 లక్షలు చేసిన మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
చాలా మందికి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించాలని ఉంటుంది. అయితే వారికి సరైన అవగాహన లేక డబ్బులు నష్టపోతుంటారు. అయితే మార్కెట్, స్టాక్స్ పై అవగాహన లేనివారు.. మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని ఎంచుకుంటే బెటరని నిపుణులు చెబుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్లలో కూడా రిస్క్ ఉంటుందని గమనించాలని హెచ్చరిస్తున్నారు. అయితే దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్లు మంచి రాబడి ఇచ్చాయి. గత ఐదేళ్లలో మంచి రాబడి ఇచ్చిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చాలానే ఉన్నాయి.
మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ మంచి రాబడి అందించింది. ఈ ఫండ్ లో ఐదేళ్ల క్రితం ఏక మొత్తంలో పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు 2.58 రెట్లకు పెరిగింది. ఉదాహరణకు ఈ ఫండ్‌లో 5 ఏళ్ల క్రితం రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ. 2.58 లక్షలుగా ఉంది. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా మంచి రాబడి అందించింది. ఆ తర్వాత నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలను ఇచ్చింది.

ఇక క్వాంట్ స్మాల్ క్యాప్ కూడా మంచి రాబడిని అందించింది. 5 సంవత్సరాల్లో 2.49 రెట్లు లాభాన్ని తెచ్చిపెట్టింది. హెచ్డీఎఫ్సీ మిడ్ క్యాప్ కూడా మంచి రాబడిని అందించింది. ఎడెల్‌వీస్ మిడ్ క్యాప్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్ ఫండ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా మంచి లాభాలను ఇచ్చాయి. నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ గత ఐదేళ్లలో 2.38 రెట్ల రాబడిని అందించింది.
మార్కెట్ పడిపోతున్నప్పుడు చాలా మంది భయపడి పెట్టుబడిని వెనక్కు తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే మార్కెట్ పడినప్పుడే పెట్టుబడి కొనసాగిస్తే ఎక్కువ యూనిట్లు వస్తాయని.. చెబుతున్నారు. అయితే మ్యూచు ఫండ్లలో నష్టభయం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ పడినప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్లు కూడా పడుతుంటాయి. ఒక్కొసారి నెగటివ్ రిటర్న్స్ కూడా ఇస్తుంటాయి.
రిస్క్ తక్కువగా ఉండాలనుకుంటే ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇందులో కూడా రిస్క్ ఉంటుందని గుర్తు చేస్తున్నారు. రిస్క్ చాలా తక్కువగా ఉండాలంటే డెట్ ఫండ్లు బెటరని సూచిస్తున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా కచ్చితమైన లాభాలు రావాలంటే.. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చని చెబుతున్నారు.
Note:ఇది కేవలం సమాచారం మాత్రమే. సూచన కాదు. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి.


Click it and Unblock the Notifications