Crude Oil: ముడి చమురు ధర తగ్గితే ఎవరికి లాభం..!
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర తగ్గుతూ వస్తుంది. అయితే అమెరికా, ఇరాన్ యుద్ధ సమయంలో ముడి చమురు ధర భారీగా పెరగడంతో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడ్డాయి. చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే ముడి చమురు ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే భారత దేశం కూడా భారీగా ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. 88 శాతం ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఇండియా ముడి చమురు కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఒక డాలర్ తగ్గినా.. భారత్ కు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
బ్రెంట్ ధర బ్యారెల్‌కు $1 తగ్గినప్పుడు, దేశానికి దాని దిగుమతుల బిల్లుపై ఏడాదికి దాదాపు రూ. 10,000-13,000 కోట్లు ఆదా అవుతాయి. ప్రస్తుతం పశ్చిమ ఆశియాలో ఉద్రిక్తత పరిస్థితి తగ్గడం, అమెరికా ఇరాన్ తాత్కాలిక ఒప్పందంతో హర్మూజ్ జల సంధిలో నౌకలు స్వేచ్ఛంగా ప్రయాణిస్తున్నాయి. దీంతో ముడి చమురు ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ముడి చమురు తగ్గుదలతో విమానయాన రంగం అత్యధికంగా ప్రయోజనం పొందనుంది.భారతీయ విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) వాటా దాదాపు 40 శాతంగా ఉన్న నేపథ్యంలో ముడి చమురు ధరలలో గణనీయమైన తగ్గుదల తక్షణమే ATF ధరలు తగ్గే అవకాశం ఉంది.

ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్‌లకు నిర్వహణ మార్జిన్‌లను మెరుగు పడే అవకాశం ఉంది. ముడి చమురు ధరలు తగ్గడం వల్ల అయిల్ మార్కెటింగ్ కంపెనీలు(OMC) కూడా లబ్ది పొందుతాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు లాభాలు పొందే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే కంపెనీలు మార్జిన్లు కోల్పోయే అవకాశం ఉంది.
తక్కువ సేకరణ ఖర్చుల నుండి ప్రయోజనం పొందుతాయి. రిటైల్ ఇంధన ధరలు కొంత ఆలస్యంగా సర్దుబాటు అయినప్పుడు లేదా పన్నులు తగ్గుదలలో కొంత భాగాన్ని భరించినప్పుడు, మార్కెటింగ్ మార్జిన్‌లు విస్తరిస్తాయి. ఇన్వెంటరీ పెరుగుదల కూడా ఒకేసారి ప్రోత్సాహాన్ని అందించగలదు. ముడి చమురు ధర తగ్గడం వల్ల ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్ రంగాలు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. వాణిజ్య వాహనాలు, విస్తృత లాజిస్టిక్స్ వ్యవస్థ (ట్రక్కింగ్, లాస్ట్-మైల్ డెలివరీ) డీజిల్‌పై ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గిస్తే సామాన్య ప్రజలు కూడా లాభపడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications