Mutual Funds: గత దీపావళి నుంచి అత్యధిక రాబడులు అందించిన మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
గత దీపావళి నుంచి చేసిన సిప్ పెట్టుబడులపై దాదాపు 13 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు 15 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి. ఈ కాలంలో మొత్తం 295 ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 142 ఫండ్లు సానుకూల రాబడులను ఇవ్వగా, అత్యుత్తమ పనితీరు కనబరిచిన మొదటి మూడు ఫండ్లు 25 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి. మరోవైపు, 153 ఫండ్లు ప్రతికూల రాబడులను ఇచ్చాయి. గత దీపావళి నుంచి చేసిన సిప్ పెట్టుబడులపై సామ్కో స్మాల్ క్యాప్ ఫండ్ అత్యధికంగా 36.35% రాబడిని అందించింది. ఈ ఫండ్‌లో అక్టోబర్ 20, 2025 నుంచి నెలకు రూ. 10,000 చొప్పున సిప్ పెట్టుబడి పెట్టి ఉంటే, ప్రస్తుతం ఆ మొత్తం రూ. 1.25 లక్షలుగా ఉండేది.
మోతీలాల్ ఓస్వాల్ ఫోకస్డ్ ఫండ్ ఈ కాలంలో సిప్ పెట్టుబడులపై 29.57% రాబడిని ఇచ్చింది. ఆ తర్వాతి స్థానాల్లో రెండు స్మాల్ క్యాప్ ఫండ్లు ఉన్నాయి. ఇందులో బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ 25.75 శాతం రాబడి ఇవ్వగా.. ట్రస్ట్ స్మల్ క్యాప్ ఫండ్ 24.53 శాతం రిటర్న్స్ ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ మల్టీక్యాప్ ఫండ్ సిప్ పెట్టుబడులపై ఇదే కాలంలో 22.82 శాతం రాబడి ఇచ్చింది. ఇన్వెస్కో ఇండియా ఫోకస్డ్ ఫండ్ 20.24 శాతం రాబడి ఇవ్వగా... హెలియస్ స్మాల్ క్యాప్ ఫండ్ 18.81 శాతం, మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ 18.36 శాతం, ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 18.08 శాతం, యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్ 15.75 శాతం, ఎల్ఐసీ ఎమ్ఎఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ 15.69 శాతం రాబడులు ఇచ్చాయి.

సంవత్సర కాలంలో గ్రో మల్టిక్యాప్ ఫండ్ 15.55 శాతం, మహింద్రా మనులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ 15.05 శాతం రాబడి ఇచ్చాయి. ఇదే కాలంలో సిప్ పెట్టుబడులపై టారస్ లార్జ్ క్యాప్ ఫండ్ 14.71% రాబడి అందించింది. ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్, పీజీఐఎం ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఇదే కాలంలో సిప్ పెట్టుబడులపై ఒక్కొక్కటి 14.55% రాబడిని అందించాయి. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 11.42 శాతం, క్వాంట్ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ 11.35% రాబడిని ఇచ్చాయి. ఇన్వెస్కో ఇండియా లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ 10.01% లాభాన్ని అందించింది. మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ & మిడ్‌క్యాప్ ఫండ్ 9.75% రాబడిని అందించింది.
అబక్కస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇదే కాలంలో 5.98% రాబడిని ఇచ్చింది. ఆస్తుల పరంగా అతిపెద్ద స్మాల్ క్యాప్ ఫండ్ అయిన నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఇదే కాలంలో 4.32% రాబడి మాత్రమే ఇచ్చింది. క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ అదే కాలంలో 2.24% లాభపడింది. ఆదిత్య బిర్లా ఎస్ఎల్ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ 0.04% రాబడిని ఇచ్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications