ఈ మధ్య మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెరిగాయి. అయితే మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఫండ్ వర్గం, స్థూల ఆర్థిక అంశాలు, ఫండ్ మేనేజర్ పనితీరు బేరీజు వేసుకోవడం తప్పనిసరిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మీరు మల్టీ-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. గత ఐదేళ్లుగా స్థిరంగా మంచి రాబడిని అందించిన వాటిని పరిగణలోకి తీసుకోవాలి.
మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లు మార్కెట్‌లోని వివిధ రంగాలు, విభాగాల స్టాక్‌లలో పెట్టుబడితో ఈక్విటీ, ఈక్విటీ-సంబంధిత సాధనాలలో కనీసం 65 శాతం ఆస్తులను పెట్టుబడి పెడతాయి. వాటిని డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ అని కూడా పిలుస్తారు. డైవర్సిఫికేషన్ కొన్ని స్టాక్‌లు, సెక్టార్‌లు, సెగ్మెంట్‌లకు ఎక్కువ ఎక్స్పోజర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సెప్టెంబర్ 30, 2023 నాటికి నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (AUMలు) రూ.93,756 కోట్లతో ఈ వర్గంలో 22 పథకాలు ఉన్నాయి. ఇది ఒక సంవత్సరం క్రితం సెప్టెంబర్ 30, 2022 నాటికి మొత్తం రూ.62,435 AUMలతో ఉన్న 14 పథకాల కంటే చాలా ఎక్కువ. ఇక్కడ, గత ఐదేళ్లలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ రాబడిని అధిగమించగలిగిన కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి.
క్వాంట్ యాక్టివ్ ఫండ్
క్వాంట్ యాక్టివ్ ఫండ్ ను ఫిబ్రవరి 12, 2001న ప్రారంభించారు. అప్పటి నుంచి 19 శాతం రాబడిని అందించింది. కీలకమైన స్టాక్‌లు ట్రెప్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఆర్‌ఐఎల్, అరబిందో ఫార్మా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టుబడి పెట్టింది. దీని AUM విలువ రూ.503 కోట్లుగా ఉంది.
మహీంద్రా మాన్యులైఫ్ మల్టీ క్యాప్ ఫండ్
మహీంద్రా మాన్యులైఫ్ మల్టీ క్యాప్ ఫండ్ ను మే 11, 2017న ప్రారంభించారు. ప్రారంభం నుంచి 15.42 శాతం వార్షిక రాబడిని అందించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఆర్‌ఐఎల్, టెక్ మహీంద్రా, టిటాగర్ రైల్ సిస్టమ్స్, బిర్లాసాఫ్ట్ లో ఎక్కువగా పెట్టుబడి పెట్టింది. దీని AUM విలువ మొత్తం రూ.2,120 కోట్లుగా ఉంది.
నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్
నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ ను మార్చి 28, 2005న ప్రారంభించారు. ప్రారంభమైనప్పటి నుంచి 17.80 శాతం వార్షిక రాబడిని అందించింది. HDFC బ్యాంక్, లిండే ఇండియా, EIH, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ లో ఎక్కువగా పెట్టుబడి పెట్టింది. ఈ ఫండ్ AUM విలువ రూ.20,192 కోట్లుగా ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications