Mid Cap Mutual Funds: ఐదేళ్లలో అధిక రాబడి ఇచ్చిన మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
తమ పోర్ట్‌ఫోలియోలో పెద్దగా హెచ్చుతగ్గులకు లోనుకాకుండా ఈక్విటీలలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని ఒక ఎంపికగా చూడొచ్చు. మ్యూచువల్ ఫండ్లలో మిడ్ క్యాప్ ఫండ్లను కూడా పరిగణలోకి తీసుకొచ్చు. మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు మధ్యస్థాయి కంపెనీలలో పెట్టుబడి పెట్టడంపై దృష్టి పెడతాయి. భారతదేశంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఈ సంస్థలు సాధారణంగా 101 నుంచి 250 మధ్య ర్యాంక్‌లో ఉంటాయి. లార్జ్-క్యాప్ సంస్థల వలె కాకుండా మిడ్-క్యాప్ స్టాక్‌లు వృద్ధి దశలో ఉన్న కంపెనీల్లో పెట్టుబడి పెడతాయి. అధిక రాబడిని అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వీటికి అధిక వృద్ధి సామర్థ్యం ఉన్నప్పటికీ స్మాల్-క్యాప్ స్టాక్‌లతో పోలిస్తే మిడ్-క్యాప్ స్టాక్‌లు సాపేక్షంగా తక్కువ అస్థిరతను కలిగి ఉంటాయి. మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు సమీకరించిన నిధులను ప్రధానంగా మిడ్-క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెడతాయి. మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ నిఫ్టీ మిడ్‌క్యాప్ ఐదేళ్లలో 23.97 శాతం రాబడి ఇచ్చింది. నిప్పన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 పండ్ ఐదేళ్లో 23.32 శాతం రాబడి ఇవ్వగా.. HDFC మిడ్ క్యాప్ ఫండ్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 22.25 శాతం, ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ BSE మిడ్‌క్యాప్ 150 22.82 శాతం, ఎడెల్వీస్ మిడ్ క్యాప్ ఫండ్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 22.75 శాతం రాబడి ఇచ్చింది.

మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లు పెట్టుబడిదారులకు స్థిరత్వం, వైవిధ్యంతో పాటు వృద్ధి అవకాశాలను అందిస్తాయి. ఈ ఫండ్‌లు ప్రధానంగా మిడ్-క్యాప్ కంపెనీలను కలిగి ఉంటాయి. మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్టాక్‌ల ధరలలోని హెచ్చుతగ్గులు సాధారణంగా స్మాల్ క్యాప్‌ల కంటే తక్కువగా ఉంటాయి. అవి లార్జ్ క్యాప్‌ల కంటే ఎక్కువ లాభాలను అందిస్తాయి. మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లు పరిమిత వృద్ధి సామర్థ్యాన్ని అందిస్తాయి. లార్జ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లతో పోలిస్తే ఈ స్కీమ్‌లలో ధరల హెచ్చుతగ్గులు మరింత తీవ్రంగా ఉండవచ్చని నిపుణలు చెబుతున్నారు. లార్జ్-క్యాప్ ఫండ్‌లతో పోలిస్తే మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లలో ధరల కదలిక సాధారణంగా మరింత అస్థిరంగా ఉంటుంది. మార్కెట్‌లో వచ్చే తీవ్రమైన దిద్దుబాట్లు మిడ్-క్యాప్ పోర్ట్‌ఫోలియోలలో పెద్ద పతనాలకు కారణం కావచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications