Large Cap Mutual Funds: అత్యధిక రాబడి ఇచ్చిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
గత సంవత్సరం కాలంగా స్టాక్ మార్కెట్లు అంతగా రాణించండం లేదు. ముఖ్యంగా లార్జ్ క్యాప్ స్టాక్ ఎక్కువగా పడిపోయాయి. దీంతో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ల రాబడి కూడా భారీగా తగ్గింది. అయితే ఈ సమయంలో లార్జ్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే వచ్చే, రెండు లేదా మూడేళ్ల వరకు ఆలోచించే వారు లార్జ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చని సూచిస్తున్నారు. అయితే గత 10 పదేళ్లలో అధిక రాబడి ఇచ్చిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు గురించి తెలుసుకుందాం.
కెనరా రోబాకో లార్జ్ క్యాప్ ఫండ్ గత పదేళ్లలో 15.10 శాతం రాబడి ఇచ్చింది. నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 15 శాతం, ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ 15 శాతం, ఎడల్వైస్ లార్జ్ క్యాంప్ ఫండ్ 14.40 శాతం, బరోడా బీఎన్పీ పరిబారిస్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 14.30 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ 14.30 శాతం రాబడి ఇచ్చింది. లార్జ్ క్యాప్ ఫండ్ అనేది ఒక ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ తన మొత్తం ఆస్తులలో కనీసం 80 శాతాన్ని లార్జ్-క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా లార్జ్-క్యాప్ కంపెనీలను 100 అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలుగా నిర్వచించారు.

లార్జ్-క్యాప్లుగా అర్హత పొందే కంపెనీల జాబితాను కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లతో పోలిస్తే లార్జ్ క్యాప్ ఫండ్లలో ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ లో అనే లార్జ్ క్యాప్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే... స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రిస్క్ ఉండకూడదని భావించే వారు ఇండెక్స్, లార్జ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. అయితే మీ పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవడం మంచిది.
ఉదాహరణకు మీరు మ్యూచువల్ ఫండ్లలో నెలకు రూ.10000 సిప్ వేయాలనుకుంటే.. అందులో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్డ్ క్యాప్ ఫండ్లు ఉండే చూసుకోవాలి. రూ.4000 స్మాల్ క్యాప్ ఫండ్లలో, రూ.2 వేలు మిడ్ క్యాప్ ఫండ్లలో, రూ.2 వేలు లార్జ్ క్యాప్ ఫండ్లలో పెట్టుడి పెట్టేలా ప్లాన్ చేసుకోవాలి. మిగతా రూ. 2 వేలలో రూ.1000 గోల్డ్ ఫండ్, మరో రూ.1000 ఫ్లెక్సీ లేదా మల్టీ క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెడితే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications