Gold ETF: అత్యధిక రాబడి అందిస్తున్న గోల్డ్ ఈటీఎఫ్స్ ఇవే..
బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే డబ్బు ఎక్కువ కావాలి. అయితే తక్కువ డబ్బులు ఉన్న పసిడిలో పెట్టుబడి పెట్టొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ ల్లో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆగష్టు 17 నాటి ACE MF డేటా ప్రకారం, గోల్డ్ ETF కేటగిరీలో సంవత్సర కాలంలో మంచి రాబడి అందించిన ఈటీఎఫ్ ల్లో ఆదిత్య బిర్లా SL గోల్డ్ ETF ఒకటి. ఇది సంవత్సర కాలం 52 శాతం రాబడి ఇచ్చింది. ఆ తర్వాతి స్థానంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ 58.9 శాతంగా ఉంది. సంవత్సరంలో కోటక్ ఈటీఎఫ్, డీఎస్బీ ఈటీఎఫ్స్ 51.8 శాతం రాబడి ఇచ్చాయి. మిర అసైట్ గోల్డ్ ఈటీఎఫ్ 51.6 శాతం రాబడి ఇచ్చింది.
ఈ ర్యాంకింగ్ కనీసం రూ. 1,500 కోట్ల నిర్వహణలో ఉన్న ఆస్తులు కలిగిన ఈటీఎఫ్ లనే తీసుకున్నారు. టాప్ ఐదు ఫండ్లలో, ఐసీఐసీఐ ప్రూ గోల్డ్ ఈటీఎఫ్ రూ. 25,821.8 కోట్ల అతిపెద్ద ఏఎంయూను కలిగి ఉంది. ఒక సంవత్సరం ప్రాతిపదికన మిరే అసెట్ గోల్డ్ ఈటీఎఫ్ తన బెంచ్‌మార్క్ కంటే 41.5 శాతం పాయింట్లు ముందుంది, బెంచ్‌మార్క్ 10.1% రాబడిని ఇచ్చింది. మూడు సంవత్సరాల ప్రాతిపదికన కూడా ఇది తన బెంచ్‌మార్క్ కంటే 34.9 శాతం పాయింట్లు ముందుంది. ఆరు నెలల రాబడి పరిశీలించినప్పుడు ఆదిత్య బిర్లా ఎస్ఎల్ గోల్డ్ ఈటీఎఫ్ 1.2 శాతంతో అగ్రస్థానంలో ఉంది. సంవత్సరం ప్రాతిపదికన చూస్తే ఆదిత్య బిర్లా ఎస్ఎల్ గోల్డ్ ఈటీఎఫ్ 52.0 శాతంతో అత్యంత బలమైన రాబడిని అందించింది.

మూడు సంవత్సరాల రాబడి పరిశీలిస్తే ఆదిత్య బిర్లా ఎస్ఎల్ గోల్డ్ ఈటీఎఫ్ 36.8 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఈటీఎఫ్ అంటే ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) అనేవి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదైన మ్యూచువల్ ఫండ్స్. ఇవి సాధారణంగా ఏదైనా సూచీ, కమోడిటీ లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడతాయి. గోల్డ్ ఈటీఎఫ్స్ తో పాటు వెండి ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications