Gold ETF, Mutual Funds: అత్యధిక రిటర్న్స్ ఇస్తున్న గోల్డ్ ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్..!

గత కొద్ది రోజులుగా గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్స్ భారీగా రాబడులు అందిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బంగారం ధర భారీగా పెరగడమే. గత రెండేళ్లుగా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు భారీ రిటర్న్స్ అందిస్తున్నాయి. గత 3 సంవత్సరాలుగా అత్యధిక రాబడి అందించిన గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ లు ఏమిటో చూద్దాం..

Gold ETF

యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్
ఈ ఈటీఎఫ్ గత మూడేళ్లలో 36.14 శాతం CAGR (సంయుక్త వార్షిక వృద్ధి రేటు)ను నమోదు చేసింది. ఈ కాలంలో రూ. 1 లక్షల ఏకమొత్తం పెట్టుబడి రూ. 2.52 లక్షలకు పెంచింది.

క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్
ఈ ఈటీఎఫ్ గత మూడేళ్లలో 35.98% CAGRను నమోదు చేసింది. రూ. 1 లక్షల ఏకమొత్తం పెట్టుబడి రూ. 2.51 లక్షలకు పెరిగి ఉండేది.

ఎస్బీఐ గోల్డ్ ఫండ్
ఈ ఫండ్ గత మూడేళ్లలో 35.77% CAGRను నమోదు చేసింది. రూ. 1 లక్షల ఏకమొత్తం పెట్టుబడి రూ. 2.50 లక్షలకు పెరిగి ఉండేది. ఎస్‌బీఐ గోల్డ్ ఫండ్ ఏకంగా 44.11 శాతం వార్షిక ఎస్‌ఐపీ రిటర్న్స్ ఇచ్చి అగ్ర స్థానంలో నిలిచింది.
రూ.10 వేల సిప్ ఎస్‌బీఐ గోల్డ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా రూ. 6.59 లక్షలు ఇచ్చింది.

యూక్సిస్ గోల్డ్ ఫండ్
ఈ ఫండ్ గత మూడేళ్లలో 35.20% CAGRను నమోదు చేసింది. రూ. 1 లక్షల ఏకమొత్తం పెట్టుబడి రూ. 2.47 లక్షలకు పెరిగి ఉండేది. యాక్సిస్ గోల్డ్ ఫండ్ 43.84 శాతం రాబడి ఇచ్చింది.

పెట్టుబడిదారులు కేవలం గత రాబడి ఆధారంగా మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎల్లప్పుడూ మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం, ​​పెట్టుబడి కాలపరిమితి మరియు ఆర్థిక లక్ష్యాల ఆధారంగా మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోండి.

బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చాలా ఈటీఎఫ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో నిప్పన్ ఇండియా ETF గోల్డ్ బీఈఎస్, టాటా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ETF BI గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ స్కీమ్, HDFC గోల్డ్ ETF కోటక్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, జెరోచా గోల్డ్ ETF (గోల్డ్‌కేస్) మిరే అసెట్ గోల్డ్ ETF ఉన్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+