మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. అందుకే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు సరైన ఫండ్ ను ఎంచుకోవాలి. రిస్క్ తక్కువగా ఉండే ఫండ్లను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫండ్ మేనేజర్, ఫండ్ గత సంవత్సరాల పనితీరు పరిగణలోకి తీసుకుని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. రిస్క్ తక్కువగా ఉన్న ఫండ్లలో ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంటాయి. ఇవి స్మాల్, మిడ్ క్యాప్ కంటే తక్కువ అస్థిరతను కలిగి ఉంటాయి.
ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే.. ఇవి మార్కెట్ క్యాపిటలైజేషన్‌లోని కంపెనీల స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే సౌలభ్యాన్నికలిగి ఉంటాయి. అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడతాయి. ఈ ఫండ్లు ఈక్విటీ & ఈక్విటీ సంబంధిత సాధనాల్లో కనీసం 65 శాతం పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం 33 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లు ఉన్నాయి. ఫోకస్డ్, లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, ఈఎల్ఎస్ఎస్, స్మాల్ క్యాప్ ఫండ్స్ వంటి అన్ని ఈక్విటీ ఫండ్ వర్గాలలో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కేటగిరీకి చెందిన AUM అత్యధికంగా ఉంది. టిలో మంచి పనితీరు కనబర్చిన ఫండ్లు ఏవో చూద్దాం.

ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 5 సంవత్సరాల రాబడి చూసుకున్నట్లయితే క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఐదు సంవత్సరాల్లో 27.12 శాతం రాబడి ఇచ్చింది. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 22.61, JM ఫ్లెక్సిక్యాప్ ఫండ్ 21.68, HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 18.87, యూనియన్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 18.49, DSP ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 18.35, ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 18.27 శాతం రాబడి ఇచ్చింది.
క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, JM ఫ్లెక్సిక్యాప్ ఫండ్లు గత ఐదేళ్లలో 20 శాతం CAGR (సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు) రాబడిని అందించాయి. అయితే గత రాబడి భవిష్యత్ రాబడులకు హామీ ఇవ్వదని ఇక్కడ గమనించడం ముఖ్యం. అందుకే పెట్టుబడిదారులు గత రాబడి మాత్రమే చూడకుండా ఫండ్ సమగ్రంగా పరిశీలించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Note: ఈ సమాచారం కేవలం వివరాలు మాత్రమే. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులు సంప్రదించగలరు. ఈ స్టోరీకి గుడ్ రిటర్న్ తెలుగుకు సంబంధం లేదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications