ఈ మధ్య మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్‌లలోకి SIP ఇన్‌ఫ్లోలు రూ. 13,000 కోట్ల మార్కు కంటే ఎక్కువగానే కొనసాగుతున్నాయి. క్రిసిల్ రేటింగ్‌ల ఆధారంగా 2023 కోసం పరిగణించాల్సిన 5 ఉత్తమ మ్యూచువల్ ఫండ్లు ఏమిటో చూద్దాం.

SBI కాంట్రా ఫండ్
SBI కాంట్రా ఫండ్ కు క్రిసిల్ నెంబర్ 1 రేటింగ్ ఇచ్చింది. ఈ ఫండ్ ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడుతోంది. ఈ ఫండ్ గత 3 సంవత్సరాలలో 31.85% వార్షిక రాబడిని అందించింది. ఈ ఫండ్ ఫోర్ట్ పోలియోలో ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ SBI ఉన్నాయి.

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్
ఈ ఫండ్ కూడా క్రిసిల్ నెంబర్ 1 రేటింగ్ ఇచ్చింది. ఈ ఫండ్ స్మాల్ క్యాప్ కంపెనీల పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెడుతుంది. ఈ ఫండ్ 3 సంవత్సరాల్లో దాదాపు 56% వార్షిక రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ స్మాల్ క్యాప్ స్టాక్ ల్లో పెట్టుబడి పెడుతోంది.

ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్
క్రిసిల్ ఈ ఫండ్ కు నెంబర్ 1 రేటింగ్ వచ్చింది. ఫ్లెక్సీ క్యాప్‌గా ఉండటం వల్ల ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కు రిస్క్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఫండ్ గత 3 సంవత్సరాలలో వార్షిక ప్రాతిపదికన 21% రాబడిని అందించింది. ఫండ్ ప్రధాన హోల్డింగ్‌ల్లో ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ వంటి స్టాక్‌లలో ఉన్నాయి. దాదాపు 66% పెట్టుబడులు లార్జ్ క్యాప్ హోల్డింగ్స్‌లో ఉన్నాయి.

SBI లార్జ్ & మిడ్‌క్యాప్ ఫండ్
మీరు లార్జ్, మిడ్‌క్యాప్ ఫండ్‌ల పెట్టాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. క్రిసిల్ ఈ ఫండ్ నెంబర్ 1గా రేటింగ్ ఇచ్చింది. ఈ ఫండ్ ప్రధానంగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీలతో కూడిన డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ ఫండ్ పెట్టుబడిదారుడికి దీర్ఘకాలిక మూలధన ప్రశంసల అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఫండ్ 3 సంవత్సరాల్లో 22% రాబడి ఇచ్చింది.

పరాగ్ పారిఖ్ ట్యాక్స్ సేవర్ ఫండ్
ఇది ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్, ఇక్కడ ఆదాయపు పన్ను Sec80c కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఫండ్ గత 3 సంవత్సరాలలో 24% వార్షిక రాబడిని ఇచ్చింది. పరాగ్ పారిఖ్ ట్యాక్స్ సేవర్ ఫండ్ HDFC, బజాజ్ హోల్డింగ్స్, ITC మొదలైన స్టాక్‌లకు ఎక్స్పోజర్ కలిగి ఉంది.
గమనిక: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. పైన పేర్కొన్న సమాచారం పూర్తిగా సమాచారమే మాత్రమే. ఎలాంటి రాబడికి హామీ లేదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications