Small Cap Mutual Funds: 10 ఏళ్లలో అత్యధిక రాబడి అందించిన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
గత 10 సంవత్సరాలుగా స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లు అత్యుత్తమ పనితీరు కనబరిచే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ విభాగంగా నిలిచాయి. అయితే ఈ విభాగంలోని అతిపెద్ద పథకాలలో పెట్టుబడిదారులు విభిన్న రాబడులను చవిచూశారు. ఐదు అతిపెద్ద ఫండ్‌లలో మూడు 18 శాతం కంటే ఎక్కువ వార్షిక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) రాబడులను అందించాయి. నిర్వహణలో ఉన్న ఆస్తుల (AUM) పరంగా ఈ విభాగంలో అతిపెద్ద పథకమైన నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 10 సంవత్సరాల వార్షిక SIP రాబడి 21.13%గా అందించింది. వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం ఈ ఫండ్ AUM రూ.80,906 కోట్లుగా ఉంది.
రూ.41,059 కోట్ల AUMతో రెండవ అతిపెద్ద పథకమైన ఎస్‌బిఐ స్మాల్ క్యాప్ ఫండ్ సిప్ పై 17.24 శాతం అందించింది. రూ.40,801 కోట్ల ఆస్తులు కలిగిన హెచ్‌డిఎఫ్‌సి స్మాల్ క్యాప్ ఫండ్ 16.99 శాతం రాబడిని అందించింది. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ రూ.35,572 కోట్ల AUMతో 24.98 శాతం రాబడి వచ్చింది. రూ.30,678 కోట్ల AUMతో ఐదవ అతిపెద్ద పథకమైన యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ 19.78 శాతం రాబడిని అందించింది. పెద్ద ఆస్తి ఆధారం ఉన్నంత మాత్రాన అధిక పెట్టుబడి రాబడులు వస్తాయని చెప్పలేమని ఇది స్పష్టం చేస్తుంది. అతిపెద్ద పథకం కూడా అగ్రశ్రేణి ప్రదర్శనకారులలో ఒకటిగా నిలిచినప్పటికీ రెండో, మూడో అతిపెద్ద ఫండ్‌లు అనేక చిన్న ఫండ్‌ల కంటే వెనుకబడ్డాయి.

ఐదు అతిపెద్ద పథకాలలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అత్యధిక రాబడులను అందించింది. నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్‌ను అధిగమించింది. మొత్తం 13 ఫండ్‌లలో క్వాంట్ స్మాల్ క్యాప్ అత్యుత్తమ పనితీరు కనబరిచిన పథకంగా నిలిపింది. ఐదు అతిపెద్ద పథకాలలో 20 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించిన ఏకైక పథకం నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ 19.78% రాబడితో దాని తర్వాతి స్థానంలో నిలవగా ఎస్‌బీఐ, హెచ్‌డిఎఫ్‌సి స్మాల్ క్యాప్ ఫండ్‌లు 18 శాతం కంటే తక్కువ రాబడిని అందించాయి. రూ.2,732 కోట్ల ఏయూఎం (AUM) కలిగిన యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్ 10 సంవత్సరాల ఎస్‌ఐపి (SIP) రాబడిని 19.82%గా అందించింది.
ఇది యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ కంటే స్వల్పంగా ముందుంది. రూ.21,467 కోట్ల ఆస్తులు కలిగిన డీఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ 19.42 శాతం రాబడిని అందించింది. రూ.18,513 కోట్ల ఏయూఎం (AUM) కలిగిన హెచ్‌ఎస్‌బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ 18.90% రాబడిని ఇచ్చింది. రూ.19,141 కోట్ల ఆస్తులు కలిగిన కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 17.97% రాబడిని అందించింది. సుందరం స్మాల్ క్యాప్ ఫండ్ 17.64% రాబడిని అందించగా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్ 17.46% రాబడిని ఇచ్చింది. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ బలహీనమైన పనితీరు కనబరిచా వాటిలో ఉన్నాయి. మొత్తం మీద 13 పథకాలలో ఆరు 10 సంవత్సరాల కాలంలో 18% కంటే ఎక్కువ వార్షిక ఎస్‌ఐపీ (SIP) రాబడులను అందించాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications