ఫిబ్రవరి 1 గేమ్ చేంజర్.. మారనున్న ఈ 5 రూల్స్.. సామాన్యుల జేబుపై ఎఫెక్ట్.. !
మరో రెండు రోజుల్లో ఫిబ్రవరి 1 నుండి కొత్త నెల ప్రారంభమవుతుంది. అదే రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనితో పాటు కొత్త నెలలో కొన్ని కొత్త మార్పులు కూడా జరగబోతున్నాయి. ఈ మార్పులు ఆర్థిక సంబంధమైనది. ఇవి సామాన్యుల ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపవచ్చు. అయితే వచ్చే నెల నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర, యూపీఐ నిబంధనలలో మరోసారి పెద్ద మార్పు రానుంది. వచ్చే నెల నుంచి ఎలాంటి పెను మార్పులు జరగబోతున్నాయో తెలుసా...
1. LPG ధరలో మార్పు
ఎల్‌పిజి ధరలు దేశవ్యాప్తంగా ప్రతి నెలా మొదటి తేదీన సవరించబడతాయి. అంటే చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG సిలిండర్ ధరలను అప్‌డేట్ చేస్తాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ రోజున ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో కోత ఉంటుందా లేక పెరుగుతుందా అనేది చూడాలి. సిలిండర్ ధరల మార్పు సామాన్య ప్రజల జేబులపై ప్రభావం చూపుతుంది. జనవరి 1 న చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్ రేటును తగ్గించిన సంగతి మీకు తెలిసిందే.

2. UPIకి సంబంధించిన రూల్స్
యూపీఐకి సంబంధించిన రూల్స్‌లో మరోసారి పెద్ద మార్పు రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని UPI లావాదేవీలను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సర్క్యులర్ కూడా జారీ చేసింది. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1, 2025 నుండి అమలులోకి వస్తాయి. వచ్చే నెల ఫిబ్రవరి 1 నుండి ప్రత్యేక అక్షరాలతో కూడిన IDలతో లావాదేవీలు ఆమోదించబడవు. NPCI ప్రకారం, ఫిబ్రవరి 1 నుండి లావాదేవీ IDలో ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలు (అక్షరాలు ఇంకా సంఖ్యలు) మాత్రమే ఉపయోగించబడతాయి. ఇది కాకుండా వేరే లావాదేవీ IDని రూపొందించినట్లయితే చెల్లింపు విఫలమవుతుంది.
3. మారుతి కార్ల ధర పెంపు
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు అలాగే నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుండి వివిధ మోడళ్ల కార్ల ధరలను రూ.32,500 వరకు పెంచాలని నిర్ణయిస్తూ ప్రకటించింది. Alto K10, S-Presso, Celerio, Wagon R, Swift, DZire, Brezza, Ertiga, Eeco, Ignis, Baleno, Ciaz, XL6, FrontX, Invicto, Jimny అండ్ Grand Vitara వంటి కార్ల ధరలు పెరగనున్న మోడళ్లలో ఉన్నాయి.
4. బ్యాంకింగ్ నియమాలలో మార్పు
కోటక్ మహీంద్రా బ్యాంక్ సాధారణ ఫీచర్లు, ఛార్జీలలో రాబోయే మార్పుల గురించి కస్టమర్లకు తెలియజేసింది, ఇవి ఫిబ్రవరి 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. వీటిలో ఉచిత ATM లావాదేవీ పరిమితుల సవరణ, వివిధ బ్యాంకింగ్ సేవల కోసం అప్ డేటెడ్ చార్జెస్ ఉన్నాయి.
5. ATF రేటులో మార్పు
ఫిబ్రవరి 1 నుంచి ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన ఎయిర్ టర్బైన్ ఇంధన ధరలను సవరిస్తాయి. అంటే ఫిబ్రవరి 1న వాటి ధరల్లో మార్పు వస్తే.. విమాన ప్రయాణీకుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది.


Click it and Unblock the Notifications