Flipkart Goat Sale: ఫ్లిప్ కార్ట్ లో గోట్ సేల్.. ఐ ఫోన్‌పై రూ.22 వేలు తగ్గింపు..!
ఫ్లిప్ కార్ట్ లో గోట్ సేల్ పేరుతో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, స్మార్ట వాచ్ లు , ల్యాప్ టాప్ లు, టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ భారీ డిస్కౌంట్లు అందించనుంది. ముఖ్యంగా ఐ ఫోన్లపై భారీ తగ్గింపు అందించనున్నారు. అయితే మెమరీ చిప్ కొరత కారణంగా ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ సేల్స్‌లో లేటెస్ట్ ఐ ఫోన్ సిరీస్‌పై లభించే డిస్కౌంట్లు అత్యంత ఆకర్షణీయంగా నిలవనున్నాయి. గోట్ సేల్ లో ఐ ఫోన్ 17, ఐ ఫోన్ 17 ప్రొ, ఐ ఫోన్ 17 ప్రొ మ్యాక్స్ పై భారీ తగ్గింపులు లభించనున్నాయి.
ఐఫోన్ 17పై భారీ తగ్గింపు లభించనుంది. అన్ని ఆఫర్ల తర్వాత ఐఫోన్ 17 రూ.70,000 లభించనుంది. కాగా ఈ ఫోన్ గతేడాది సెప్టెంబర్ లో విడుదలైంది. విడుదలైనప్పుడు దీని రూ.82,900 గా ఉండేది. ఇప్పుడు దీనిపై రూ.12 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఐ ఫోన్ 17 ప్రొపై కూడా భారీ తగ్గింపు రానుంది. ఈ గోట్ సేల్ లో రూ.1,34, 900 ఉన్న ఐ ఫోన్ 17 ప్రొ రూ. 1,12,900 లకు లభించనుంది. ఈ ఫోన్ పై దాదాపు రూ.22 వేలకు తగ్గింపు ఉండనుంది.

టాప్-ఎండ్ మోడల్ అయిన ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ ధరలో కూడా భారీ తగ్గింపు ఉండనుంది. ఈ ఫోన్ ధర రూ.1,49,900 ఉండగా.. గోట్ సేల్ లో రూ. 1,27,900 ధరకు లభించనుంది. ఐ ఫోన్ 17 ప్రొ మ్యాక్స్ పై రు.22,000 తగ్గింపు ఉండనుంది. ఈ భారీ తగ్గింపులతో పాటు ఐ ఫోన్ సిరీస్ పై నో కాస్ట్ ఈఎంఐ, అదనపు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. కాగా ఫ్లిక్ కార్ట్ గోట్ సేల్ జూలై 4న ప్రారంభం కానుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు ఒక రోజు ముందుగానే గోట్ సేల్ లో కొనుగోలు చేయవచ్చు.
అంతేకాదు బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ఎస్‌బీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల ద్వారా 10 శాతం బ్యాంక్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. కొత్తగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్‌కార్డు తీసుకునేవారికి రూ.3 వేల వెల్‌కమ్ వోచర్లు లభించనున్నాయి. యాపిల్ ఐప్యాడ్స్, మ్యాక్ లపై కూడా డిస్కౌంట్లు ఉండనున్నాయి. మ్యాక్ బుక్ నియో పై రూ.10 వేల తగ్గింపు ఉండనుంది. మ్యాక్ బుక్ ఎయిర్ ఎం5పై రూ.29 వేలు, మ్యాక్ బుక్ ప్రొ ఎం5పై రూ.70 వేలు తగ్గింపు ఉండనుంది. అయితే ఈ గోట్ సేల్ లో ఐఫోన్లు తప్పా.. మిగతా వాటిపై తగ్గింపులు ఇవ్వనట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిప్ కొరతతో మొబైల్ ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. అందుకే డిస్కౌంట్లు ఇవ్వడం లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications