మీరు ఇపుడు టీనేజ్ వయసులో ఉన్నారా.. ఎ ప్రోఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదా... కానీ రాబోయే కొన్నేళ్లలో జాబ్ మార్కెట్ కోసం రెడీ అవడానికి బిజీగా ఉన్న వారికీ గుడ్ న్యూస్. ఎందుకంటే ఇలాంటి భవిష్యత్తు గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం ఉన్న సరైన జీతం లేక సతమతమవుతున్నారు. కరోనా మహమ్మారి తరువాత అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాయి. కానీ రానున్న రోజుల్లో ఏ రంగాళ్లలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఒక అంచనా ఉండటం ముఖ్యం.
ఇందుకు టూరిజం అండ్ హాస్పిటాలిటీ రంగం కీలకం. రాబోయే రోజుల్లో ఈ రంగాలలో చాలా ఉద్యోగాలు ఉంటాయి, మీరు వెతికిన కూడా టూరిజం అండ్ హాస్పిటాలిటీ రంగానికి చెందిన స్కిల్స్ ఉన్న యువత కొరత ఉంటుంది. ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) & కన్సల్టెన్సీ కంపెనీ ఎర్నెస్ట్ & యంగ్ (EY) రూపొందించిన నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడైంది.
2036-37 నాటికి 61 లక్షల ఉద్యోగాలు
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) & కన్సల్టెన్సీ కంపెనీ ఎర్నెస్ట్ & యంగ్ (EY) నివేదిక ప్రకారం, 2036-37 నాటికి టూరిజం అండ్ హాస్పిటాలిటీ రంగంలో 61 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాయి. వీటిని సాధించడానికి డిజిటల్ మార్కెటింగ్, పర్యాటకం, కస్టమర్ సేవలకు సంబంధించిన స్కిల్స్ లో స్పెషలైజేషన్ అవసరం. ఈ నివేదికలో టూరిజం ఇంప్లిమెంటేషన్ ఇండెక్స్‌ను విడుదల చేయాలని ప్రతిపాదించారు. తద్వారా ఉపాధి ట్రెండ్స్, శ్రామిక శక్తిని సిద్ధం చేయడానికి ప్రణాళికలను నిరంతరం పర్యవేక్షించవచ్చు.

ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలో కీలక పాత్ర
CII 18వ వార్షిక పర్యాటక సదస్సులో రాబోయే రోజుల్లో ఆర్థికాభివృద్ధి ఇంకా ఉపాధి కల్పనలో టూరిజం & హాస్పిటాలిటీ రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నొక్కి చెపింది. ప్రస్తుతం భారతదేశం మొత్తం ఉపాధిలో పర్యాటకం ఇంకా ఆతిథ్యం ఎనిమిది శాతం దోహదపడుతోంది. కరోనా షాక్‌లు ఉన్నప్పటికీ, దేశీయ పర్యాటక రంగంలో విజృంభణ కారణంగా ఈ రంగం ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది. 2036-37 నాటికి ఈ రంగంలో ఉపాధి రెట్టింపు అవుతుందని అంచనా. కొత్తగా 61 లక్షల ఉద్యోగాల్లో పురుషులకు 46 లక్షలు, మహిళలకు 15 లక్షలు ఉండొచ్చు అని అంచనా. ఈ అంచనాలు శ్రామిక శక్తిని పెంచడమే కాకుండా మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది.


Click it and Unblock the Notifications