వచ్చే నెలలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు 15 రోజుల పాటు మూతపడనున్నాయి. వారాంతాల్లో పాటు, మొహర్రం, గురు హరగోవింద్ జీ పుట్టినరోజు, అషూరా, కేర్ పూజ వంటి సందర్భాలలో బ్యాంకులు మూసివేయనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితా ప్రకారం, 8 సెలవులు వివిధ రాష్ట్రాల్లోని వివిధ పండుగలకు రాష్ట్ర-నిర్దిష్ట సెలవులు, మరికొన్ని వారాంతపు సెలవులు ఉండనున్నాయి.
జులై 5న గురు హరగోవింద్ జీ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ, శ్రీనగర్ అంతటా, జులై 6న MHIP డే న అంతటా బ్యాంకులు మూసివేస్తారు. జూలై 11న కేర్ పూజ సందర్భంగా త్రిపుర అంతటా బ్యాంకులు కూడా మూసివేయనున్నారు. త్రిపుర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో జులై 29న మొహర్రం సందర్భంగా బ్యాంకులు మూసివేస్తారు.

సెంట్రల్ బ్యాంక్ ఈ సెలవులను నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద హాలిడే, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్, బ్యాంక్‌ల క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ అని వర్గీకరిస్తుంది. జులైలో బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంది. ఎందుకంటే స్థానిక పండుగల ఆధారంగా సెలవులు నిర్ణయిస్తారు. ATMలు, నగదు డిపాజిట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యథావిధిగా పని చేస్తాయి.
అయితే, ప్రజలు రూ. 2,000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్‌తో సహా తమ బ్యాంకు సంబంధిత పనిని ప్లాన్ చేసుకునే ముందు వచ్చే నెలలో బ్యాంకు సెలవులపై దృష్టిలో ఉంచుకోవాలి. జులై 2 ఆదివారం, జులై 5 గురు హరగోవింద్ జీ పుట్టినరోజు జమ్మూ, శ్రీనగర్ బ్యాంకులకు హాలిడే ఇస్తారు.
జులై 6న MHIP డే సందర్భంగా మిజోరంలో బ్యాంకులు పని చేయవు. జులై 8 రెండవ శనివారం, జులై 9 ఆదివారం. జులై 11 కేర్ పూజా సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు.
జులై 13 భాను జయంతి సందర్బంగా సిక్కింలో బ్యాంకులకు హాలిడే. జులై 16 ఆదివారం. జులై 17 యు టిరోట్ సింగ్ డే సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు పనిచేయవు. జులై 21న ద్రుక్పా త్షే-జి సందర్భంగా సిక్కింలో హాలిడే. జులై 22 నాల్గో శనివారం. జులై 23 ఆదివారం.
జులై 28న అషూరా సందర్భంగా జమ్మూ, శ్రీనగర్ బ్యాంకులకు సెలవు. జులై 29 ముహర్రం (తజియా) త్రిపుర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్యాంకులు పని చేయవు. జులై 30 ఆదివారం. జులై 31 హర్యానా, పంజాబ్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా రెండు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.


Click it and Unblock the Notifications