Mutual Funds: స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలోకి భారీగా పెట్టుబడులు..!

సెప్టెంబర్ 2026లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) డేటా ప్రకారం ఈక్విటీ-ఆధారిత పథకాలు సెప్టెంబర్‌లో రూ. 38,306.55 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇది ఆగస్టులోని రూ. 29,328.62 కోట్లతో పోలిస్తే దాదాపు 31 శాతం ఎక్కువ. నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కంట్రిబ్యూషన్లు కూడా రూ. 32,490 కోట్లతో సర్వకాలిక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అదే సమయంలో ఈక్విటీ ఫండ్ కేటగిరీలలో అత్యధికంగా స్మాల్-క్యాప్ ఫండ్లలోకి రూ. 9,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి.

డెట్ మ్యూచువల్ ఫండ్లు రూ. 1,83,155.76 కోట్ల నికర ఉపసంహరణలు పెరిగాయి. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆగస్టులో రూ. 41,368.05 కోట్ల నికర పెట్టుబడులతో పోలిస్తే సెప్టెంబర్‌లో రూ. 1,33,214.25 కోట్ల నికర నిధుల ఉపసంహరణను నమోదు చేసింది. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లకు రూ. 8,977.93 కోట్లు అదనంగా పెట్టుబడులు వచ్చాయి. ఆగస్టులోనే ఈక్విటీ ఫండ్ల పెట్టుబడులు దాదాపు 19 శాతం పెరుగుదల నమోదు చేశాయి. స్మాల్-క్యాప్ ఫండ్లు రూ. 9,038.57 కోట్ల ఈక్విటీ పెట్టుబడుల ప్రవాహంతో అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో మిడ్-క్యాప్ ఫండ్లు రూ. 7,834.84 కోట్లతో నిలిచాయి.

Mutual Funds

ఈ రెండు కేటగిరీలు కలిసి రూ. 16,873.41 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది మొత్తం ఈక్విటీ ఫండ్ పెట్టుబడుల ప్రవాహంలో దాదాపు 44 శాతంతో సమానం. ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్లలో కూడా పెట్టుబడులు పెరిగాయి. ఆగస్టులోని రూ. 5,059.42 కోట్లు రాగా.. సెప్టెంబర్ లో రూ. 6,701.80 కోట్లు వచ్చాయి. లార్జ్ క్యాప్ ఫండ్ల నుంచి జూలై, ఆగస్టులో ఎక్కువగా ఉపసంహరణలు జరిగాయి. కాని సెప్టెంబర్ లో లార్జ్-క్యాప్ ఫండ్లలోకి రూ. 859.47 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో డెట్ మ్యూచువల్ ఫండ్లు సంబంధించి ఆగస్టులోని రూ. 8,127 కోట్ల నికర నిధుల ఉపసంహరణ ఉండగా.. సెప్టెంబర్ లో రూ. 1.83 లక్షల కోట్లకు చేరింది.

సెప్టెంబర్ నెలతో ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం కూడా ముగుస్తుంది. ఈ కాలంలో సంస్థాగత పెట్టుబడిదారులు, కంపెనీలు తమ ద్రవ్య అవసరాలను తీర్చడానికి స్వల్పకాలిక డెట్ పథకాల నుంచి నిధులను ఉపసంహరించుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఆగస్టులో రూ. 19,934.29 కోట్ల పెట్టుబడులు రాగా.. రూ. 95,743.20 కోట్ల నికర నిధులు బయటకు వెళ్లాయి. మనీ మార్కెట్ ఫండ్ల నుంచి కూడా రూ. 50,846.21 కోట్ల నిధులు బయటకు వెళ్లాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+