Nita Ambani: నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా.. ఆ డబ్బులతో జీవితాంతం బతికేయొచ్చు.!
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీతా అంబానీ ఒక వ్యాపారవేత్తనే కాకుండా పలు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు. ఆమె ధరించే దుస్తులు, నగల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది. నీతా అంబానీకి కాస్ట్లీ బ్యాగులంటే చాలా ఇష్టం. కొద్ది నెలల క్రితం ఆమె ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాగు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ బ్యాగు విలువ రూ.15 కోట్లని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
బ్యాగ్ వైట్ గోల్డ్, ఖరీదైన వజ్రాలతో రూపొందించిన హెర్మెస్ కెల్లీమార్ఫోస్ బ్యాగని తెలుస్తోంది. ఆలాగే ఆమె విలాసవంతమైన బట్టలను ధరిస్తారు. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. నీతా ఖరీదైన బ్యాగులు, దుస్తులు ధరించడమే కాదు.. సేవ కార్యక్రమాల్లో కూడా ముందున్నారు. ఆమె రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఆరోగ్యం రంగంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రులు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అలాగే లాక్షలాది మంది విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తున్నారు. అయితే తాజాగా నీతా అంబానీ వాడే వాటర్ బాటిల్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

బాటిల్ ఖరీదు భారీగా ఉంటుందని చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం ఆమ ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాటర్ బాటిల్ వాడడం ప్రారంభించినట్లు పలు నివేదికలు వివరిస్తున్నాయి. ఆమె తన అందాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఒక ప్రత్యేకమైన వాటర్ బాటిల్‌లో నీరు తాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ వాటర్ బాటిల్‌ను ప్రముఖ మెక్సికన్ డిజైనర్ ఫెర్నాండో అల్టామినో డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ నీళ్ల సీసాను అసలైన బంగారంతో తయారు చేశారని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ బాటిల్ లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీరు - అక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మోడిగ్లియాని ఉందని చెబుతున్నారు.
ఈ ఖరీదైన నీటిని ఫిజీ, ఫ్రాన్స్, ఐస్‌లాండ్‌లోని సహజ సెలయేటి నీటి బుడగల నుంచి సేకరించారు. ఇందులో 24-క్యారెట్ల 5 గ్రాముల బంగారం రేణువులను కూడా కలిపారని వార్తలు వస్తున్నాయి. ఈ నీరు చర్మాన్ని పునరుజ్జీవింపజేసి, తేమగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతారు. నీతా అంబానీ రోజు తాగే ఈ వాటర్ బాటిల్ ధర అక్షరాల రూ.49 లక్షలు. అవును మీరు విన్నది నిజమే.. కాగా ఈ నీళ్ల బాటిల్ కు సంబంధించి చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. దేశంలో కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీరు లేని వారు చాలా మంది ఉన్నారని.. తినడానికి తిండి లేని ఇంకా ఎక్కువ మంది ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అలానే మన దేశంలో బంగారపు పల్లెంలో అన్నం తినేవారు కూడా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఏదైనా డబ్బుపై ఆధారపడి ఉంటుందని.. డబ్బుంటేనే మనిషికి విలువ ఉంటుందని నొక్కి చెబుతున్నారు.


Click it and Unblock the Notifications